»   »  రామ్‌చరణ్,కృష్ణ వంశీ చిత్రం ఫస్ట్ లుక్(ఫోటోలు)

రామ్‌చరణ్,కృష్ణ వంశీ చిత్రం ఫస్ట్ లుక్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి నేపథ్యమున్న యువకుడిగా కనిపించబోతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇది.

ఈ స్టిల్స్ లో రామ్ చరణ్ ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. కృష్ణవంశీ ఖచ్చితంగా ఈ చిత్రంతో మంచి హిట్ కొడతాడంటున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా రామ్ చరణ్ ని తీర్చిదిద్దడం ప్లస్ అవుతుందంటున్నారు.

''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ చిత్రం ఈ నెల 26 వరకు పొల్లాచ్చిలోనే చిత్రీకరణ కొనసాగుతుంది. అనంతరం హైదరాబాద్‌లో రూపొందించిన సెట్‌లో కుటుంబ నేపథ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.

ఫస్ట్ లుక్ ఫోటోలు స్లైడ్ షోలో...

ఎన్నారై గా...

ఎన్నారై గా...

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌.అలాగే పల్లె,పొలాలు, పంచెకట్టు వంటివన్నీ కనిపిస్తాయి.

తాతా,మనవడు కథ

తాతా,మనవడు కథ

తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి.

ఎడ్లబండిపై...

ఎడ్లబండిపై...

ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ-

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ-

''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ...

కృష్ణవంశీ మాట్లాడుతూ...

తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.

ఎవరెవరు..

ఎవరెవరు..

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan,Krishna Vamsi's upcoming film first look Revealed. Kajal is his co-star in this family entertainer and it also stars Srikanth and Kamalinee Mukherjee in important roles. Tamil actor Raj Kiran has been roped in to play a crucial role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu