»   » నమ్మలేరు అచ్చంగా అలాగే...! బయోపిక్ కోసం అతనిలా మారాడు (ఫొటోలు)

నమ్మలేరు అచ్చంగా అలాగే...! బయోపిక్ కోసం అతనిలా మారాడు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో యువ కథానాయకుడు రణబీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ జీవితంలోని అన్ని కోణాలను చూపిస్తామని దర్శకుడు ముందే చెప్పడంతో.. అసలు ఈ కేరక్టర్ లో రణ్‌బీర్ ఎలా ఉంటాడనే ఆసక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు సంజయ్ దత్ లా మారిపోయిన రణ్‌బీర్ కపూర్ ఫోటోలు..బయటికి వచ్చాయి.

 First Look Of Ranbir Kapoor As Sanjay Dutt

తాజాగా సంజయ్ దత్ పాత్రను పోషిస్తున్న రణ్‌బీర్ లుక్ ని రఘువేంద్ర సింగ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ లుక్ లో రణబీర్ పొడుగు హెయిర్ తో పాటు మెరూన్ కలర్ షర్ట్ ధరించి దానిపై బ్లాక్ కోటుతో కనిపించాడు. ఈ లుక్ లో రణ్‌బీర్ ని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు. సంజయ్ దత్ బయోపిక్ ఎప్పుడో మొదలైనప్పటికి డేట్స్ , క్యాస్ట్ ఇష్యూస్ వలన వాయిదా పడుతూ వస్తున్నది. ఇక ఈ చిత్రంలో దియా మీర్జా, విక్క కౌషల్ మరియు మనీషా కోయిరాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1990ల నాటి కాలంలో సంజయ్ దత్ ఎలా ఉండేవాడో.. ఎలాంటి బాడీ మెయింటెయిన్ చేసేవాడో.. హెయిర్ స్టైల్ ఎలా ఉండేదో.. డ్రెసింగ్ ఎలా కనిపించేదో.. అచ్చం అలాగే మారిపోయిన రణ్‌బీర్ కపూర్ ఫోటోలు రచ్చ చేసేస్తున్నాయి.

మరోవైపు 'దత్' మూవీలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ గా పరేష్ రావల్.. తల్లి నర్గీస్ గా మనీషా కొయిరాలా.. సంజయ్ భార్య మాన్యతా దత్ గా దియా మీర్జా నటిస్తుండగా.. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఒకనాటి బాలీవుడ్ జంట... మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్. వీరిద్దరూ 90లలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఖల్ నాయక్ సినిమా సందర్భంగా సంజయ్, మాధురిలపై అప్పట్లో బోలెడు పుకార్లు కూడా వినిపించాయి.

 First Look Of Ranbir Kapoor As Sanjay Dutt

అయితే ఆమె వాటిని ఖండించలేదు.. అవునని చెప్పలేదు అయితే ఇప్పుడు ఈ బయోపిక్ సందర్భంగా మాధురీ దీక్షిత్ టాపిక్ వచ్చిందంట. ఆమెతో సంజయ్ రిలేషన్ షిప్ సినిమాలో చూపిస్తారా అన్న ఆలోచనలతో ఉన్న అభిమానులకు.. దానిపై పెద్దగా వెళ్లరనే తెలుస్తోంది. దీనిపై మాధురితో ఎలాంటి చర్చలు జరపకూడదని.. ఆమె ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం గడుపుతుండగా.. ఆ పాత విషయాలన గుర్తు చేయొద్దని అన్నాడట సంజయ్. మరోవైపు మాధురి కూడా తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ జీవితంపై వస్తున్న సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని బాలీవుడ్ టాక్.

 First Look Of Ranbir Kapoor As Sanjay Dutt

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఇప్పుడు మళ్ళీ ఈ మాజీ ప్రేమికుడికి మాధురి కాల్ చేసిందట గతంలో బాగా క్లోజ్ గా ఉన్నప్పటికీ మాధురీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం.. సంజయ్ దత్ లైఫ్ లో చాలా జరిగిపోవడం జరిగింది. అయితే 25ఏళ్ల తర్వాత మాధురీ ఫోన్ చేసిందట.. అందుకు కారణం ఇటీవలే రాజ్ కుమార్ హిరాణీ సంజయ్ దత్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సంజయ్ దత్ క్యారెక్టర్ ను రణబీర్ కపూర్ చేయనున్నట్లు కూడా తెలిపారు. అయితే సంజయ్ దత్ జీవితకథలో తన గురించి ఏమన్నా చూపిస్తారేమో అని వాకబు చేసిందట. అయితే తన గురించి ఎటువంటి సన్నివేశాలూ లేకుండా చూసుకుంటానని మాధురీకి సంజయ్ హామీ ఇచ్చాడట.

English summary
Ranbir Kapoor recently canned a scene for the Dutt biopic and here's how they looked in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu