»   » సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ ఫస్ట్ లుక్ (ఫొటోలు )

సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ ఫస్ట్ లుక్ (ఫొటోలు )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. రాశీ ఖన్నా హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. గురువారం సాయిధరమ్‌తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'సుప్రీమ్‌' ఫస్ట్‌లుక్‌ ఫొటోలు విడుదల చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నవి అవే...

సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ '''పిల్లా నువ్వులేని జీవితం' విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' అందరికీ నచ్చడం మరింత సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రూపుదిద్దుకొంటున్న 'సుప్రీమ్‌' కూడా అన్ని వర్గాల్నీ ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది''అన్నారు.


First Look: Sai Dharam in 'Supreme'

పటాస్ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన అనిల్ రావిపూడి, తన రెండో సినిమాను కూడా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 5నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో సినిమా ‘శతమానం భవతి' కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే సాయిధరమ్ తేజ మరో చిత్రం కమిటయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఓం తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు జరిగింది. ఈ చిత్రానికి సంభందించి తిక్క అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా... ‘హ్యాండిల్ విత్ కేర్' అని పెడుతున్నట్లు తెలుస్తోంది.రోహిన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.


First Look: Sai Dharam in 'Supreme'

డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నెంబర్ వన్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ టైటిల్ ని బట్టి ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది. సినిమాలో ఎక్కువ భాగం శ్రీలంకలో షూటింగ్ జరగనుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

English summary
Today on the eve of Sai Dharam Tej's birthday makers have released first look of Sai from the film. Sai Dharam Tej plays a cab driver in the film which co-stars Raashi Khanna as the female lead in the movie tipped to be an action entertainer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu