»   » రామ్ చరణ్ 'జంజీర్' రీమేక్ విలన్ ఫస్ట్ లుక్ (ఫొటో)

రామ్ చరణ్ 'జంజీర్' రీమేక్ విలన్ ఫస్ట్ లుక్ (ఫొటో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్‌' రీమేక్ లో విలన్ గా సంజయ్ దత్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రాణ్ చేసిన షేర్ ఖాన్ పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను సంజయ్ దత్ ఓ రేంజిలో పోషిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ మేరకు ఆయన గెటప్ తో కూడిన ఫస్ట్ లుక్ బయిటకు వచ్చింది. మీరు చూస్తున్నది అదే. అప్పట్లో షేర్ ఖాన్..ఇప్పటి షేర్ ఖాన్.

  అలాగే ఈచిత్రాన్ని ఏప్రిల్ 12, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పుడు సంచలనాలు సృష్టించిన 'జంజీర్' సినిమా మళ్లీ రీమేక్ అవుతూండటంతో అందరిలో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా తర్వాత అమితాబ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. యాంగ్రీ యంగ్‌మేన్ అంటూ అమితాబ్‌ను పిలవడం ప్రారంభించారు. అమితాబ్ పాత్రకు అంతగా గుర్తింపు రావడానికి కారణం ప్రత్యర్థిగా కనిపించే షేర్‌ఖాన్ పాత్రను ప్రాణ్ అంతగా రక్తికట్టించడమే.

  ఒకప్పటి జంజీర్‌లో ప్రధానంగా కనిపించే పాత్రలు రెండు. ఒకటి విజయ్ (అమితాబ్), రెండు షేర్‌ఖాన్(ప్రాణ్). బాలీవుడ్ సినీ చరిత్రలో షేర్‌ఖాన్ పాత్రకు అంతటి ప్రాధాన్యం దక్కిం దంటే జంజీర్ కథలో ఆ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రాముఖ్యత ఉన్న షేర్‌ఖాన్ పాత్రలో ఇప్పుడు సంజయ్ దత్ కనిపించటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఒకప్పటి జంజీర్‌లో ప్రాణ్, అమితాబ్‌తో పోటీ పడి నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశా డు. అయితే తాజా జంజీర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

  షేర్‌ఖాన్ పాత్రకు సంజయ్ పూర్తి న్యాయం చేస్తాడని అనుకున్నా విజయ్ పాత్రలో రాంచరణ్ కనిపించడం సంజయ్ కి పోటీగా నిలవటం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలంటున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తారు. తెలుగు వెర్షన్‌లో షేర్‌ఖాన్‌గా సోను సూద్‌ కనిపిస్తారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వెర్షన్ కు గానూ యోగి డైరక్ట్ చేస్తున్నారు. 'జంజీర్' చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. అయితే తెలుగు మార్కెట్‌పై, డబ్బింగ్ కార్యక్రమాలపై హిందీ దర్శకుడైన అపూర్వ లకియా, అక్కడి నిర్మాతలకు అంతగా అవగాహన లేక పోవడం వల్ల డ ఆ బాధ్యతలను పర్‌ఫెక్టుగా నిర్మహించే బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు యోగికి అప్పగించారు. జంజీర్ చిత్రం తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఈయనే చూస్తున్నారు.

  English summary
  Sanjay Dutt will be essaying the role of Sher Khan in the Hindi version of the Zanjeer remake which was played by Pran in the original Zanjeer (1973). And that was Sanjay Dutt's look in the Zanjeer film, as he portrays the iconic character of Sher Khan, which was originally played by Pran. Well, for all you people, it's time to breathe easy as Bollywood Hungama brings to you the much awaited Sanjay Dutt's look in the film. His unique look has been designed by director Apoorva Lakhia himself. Apoorva knew exactly what kind of look he wanted for Sanjay Dutt as Sher Khan. He roped in well-known designer Navin Shetty for the costume and popular hair stylist Aalim's team for the hair!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more