»   » ప్రభాస్ పుట్టిన రోజు అని 'ఫస్ట్ లుక్' వదిలారు(ఫొటోలు)

ప్రభాస్ పుట్టిన రోజు అని 'ఫస్ట్ లుక్' వదిలారు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: యూవీ క్రియేషన్స్‌ పతాకంపై శర్వానంద్‌ హీరోగా నటించిన 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రం ఫస్ట్‌లుక్‌ ఫొటోలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్‌ వారు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడవచ్చు.

దీంతోపాటు ఈ శుక్రవారం నటుడు ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకించి కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. శర్వానంద్‌తో జంటగా సురభి నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశ్రీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు.

First Look: Sharwanand's Express Raja unveiled

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్‌కొట్టాక దర్శకుడు మేర్లపాక గాంధీకి వరస అవకాశాలు చుట్టుముట్టాయి. తరువాతి సినిమా విషయంలో ఆచితూచి అడుగేయాలని, ఓ మంచి స్క్రిప్ట్‌తో రావాలనే ప్లాన్‌లో ఉన్నాడు. లేటెస్ట్‌గా మేర్లపాక గాంధీ శర్వానంద్‌తో ఈ సినిమా రెడీ అయ్యింజి. 'మిర్చి', 'రన్ రాజా రన్', 'జిల్' చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.

శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో పూర్తయింది. సిటిజన్, రఘువరన్ బి.టెక్ లాంటి అనువాద సినిమాలతో పాటు బీరువా సినిమాలో హీరోయిన్ గా నటించిన సురభి ఈ సినిమాలో శర్వాతో జోడీ కట్టింది.

First Look: Sharwanand's Express Raja unveiled

ఎక్స్ ప్రెస్ రాజా పేరెందుకొచ్చిందంటే.. రాజా (శర్వానంద్) ఆలోచనలు, పనులు ఎక్స్ప్రెస్ లా మంచి దూకుడుమీదుంటాయి. ఇలాంటి అబ్బాయి తన ప్రేమలో ఎలాంటి వేగాన్ని చూపాడన్నది తెరపైన చూపించనున్నారు. మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు సినిమాకి స్వరాలందించిన గోపీ సుందర్ మరోసారి శర్వా సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

First Look: Sharwanand's Express Raja unveiled

ఈ సినిమా పాటలు నెలాఖరున విడుదల కానున్నాయి. భలే భలే మగాడివోయ్ పాటలకి సంగీతం అందించింది గోపీ సుందరే. సినిమా కూడా ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది.

English summary
Express Raja first look stills and posters with logo were unveiled on the eve of Dussera festival as well as Prabha’s birthday (Oct 23).
Please Wait while comments are loading...