»   » ఫస్ట్ లుక్ లోనే రచ్చ చేసాడే, సినిమా ఏ రేంజిలో ఉంటుందో

ఫస్ట్ లుక్ లోనే రచ్చ చేసాడే, సినిమా ఏ రేంజిలో ఉంటుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: విక్ట‌రీ వెంక‌టేశ్ బాబు బంగారం సినిమా త‌రువాత 'సాలా ఖ‌డూస్‌' హిందీ రీమేక్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ క్రీడా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని హిందీలో ద‌ర్శ‌కత్వం వ‌హించిన సుధ కొంగ‌ర దీనికి కూడా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌తలు తీసుకుని బరిలోకి దిగింది. ఈ సినిమాకు 'గురు' టైటిల్ ను పెట్టి ఫస్ట్ లుక్ వదిలారు. కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆంధ్రా అందగాడు' సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టిన సుధా దాదాపు అయిదేళ్ళ తర్వాత ఈ ద్విభాషా చిత్రాన్ని రూపొందించారు.

వెంకటేశ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుందని పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'సాలా ఖడూస్‌' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూండటంతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

First Look: Venkatesh in and as Guru

క్రిస్మ‌స్ పండుగ‌కు సినిమా విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హిందీ వెర్ష‌న్‌లో హీరోయిన్ గా చేసిన రితికాసింగ్ తెలుగులో కూడా అదే పాత్ర‌ను పోషిస్తుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక కెరీర్ లో స్ట్రైట్ సినిమాల కన్నా రీమేక్ లే ఎక్కువున్న వెంకటేష్ కి ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా కన్నా మల్టీస్టారర్ హీరోగా ఎక్కువ పేరు వచ్చింది. మధ్యలో దృశ్యం లాంటి రీమేక్ తో సోలో హీరోగా సాలిడ్ సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు ఈ బాలీవుడ్ సినిమా చేయటం ఆయన కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందంటున్నారు. ఈ సినిమాలో అంత స్పెషాలిటి ఏముందో తెలుసా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే ని కూడా అందించాడు.

First Look: Venkatesh in and as Guru

అప్పట్లో షారుఖ్ ఖాన్ కి చక్ దే ఇండియా ఎంతటి పేరు తెచ్చిందో ఈ సినిమా మాధవన్ కి అంత పేరు తెచ్చిందని చెప్తున్న ఈ సినిమాలో ఓ రిటైర్డ్ బాక్సర్ ఓ లేడి బాక్సర్ ను ఎలా చాంపియన్ చేశాడో అదే స్టోరీ. కాగా ఈ స్టోరీ ఎంతో నచ్చిన వెంకటేష్ హిందీలో ఈ సినిమా హిట్ అయిన వెంటనే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

English summary
The first look of Venkatesh starrer 'Guru' has been unveiled. Remake of Bollywood film Saala Khadoos, this film has Venkatesh playing the role of a boxing coach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu