»   » సూపర్ స్టార్ బురదలో...అదే ఫస్ట్ లుక్ (ఫొటో)

సూపర్ స్టార్ బురదలో...అదే ఫస్ట్ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'దంగల్‌'. ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీకే తరహాలో ఈ చిత్రంలోనూ ఆమిర్‌ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సోమవారం ఆమిర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.

'పీకే' తర్వాత ఇంతవరకు ఆమీర్‌ ఖాన్‌ కొత్త సినిమా ఏదీ మొదలు కాలేదు. తర్వాత సినిమా ఏంటో తెలిసినా.. ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు. అదిగో ఇదిగో అంటూ వూరిస్తోన్న ఆమీర్‌ ఖాన్‌ కొత్త సినిమా 'దంగల్‌' చిత్రీకరణ మొదలైంది. మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ అనే మల్లయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.

ఇందులో ఆమీర్‌ మహవీర్‌ సింగ్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లూధియానాలో మొదలైంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం, విడుదల చేసింది.

బురదలో ఆమీర్‌ ముఖం చూపిస్తూ ఈ ఫస్ట్‌లుక్‌ రూపొందించారు. ఈ సినిమాలో ఆమీర్‌ సరసన సాక్షి తన్వర్‌ నటిస్తోంది. ఆమీర్‌ కుమార్తెలుగా ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా నటిస్తున్నారు. నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

First Look: A Very Muddy Aamir Khan in Dangal

చూసిన వారందరికి ఒళ్లు జలదరించేలా ఈ పోస్టర్ ఉండటం విశేషం. పంజా విసిరేముందు సింహం చూసేముందు దాని చూపు ఎంతటి తీక్షణంగా కనిపిస్తుందో అంతే స్థాయిలో చూస్తూ బురదలో నుంచి ముఖం మాత్రమే బయటకు కనిపించేలా ఉన్న ఈ చిత్ర తొలి పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటోంది.

''మహవీర్‌ గురించి పూర్తిగా తెలుసుకొని నటిస్తే ఆ పాత్ర బాగా పండుతుందని ఆమీర్‌ ఆలోచన. అందుకే బబిత, గీత ముంబయి వచ్చి ఆమీర్‌ను కలిశారు'' అని ఆమీర్‌ సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే నెల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆమీర్‌ మేనకోడలు పబ్లో సహాయ దర్శకురాలిగా పని చేస్తుంది.

దంగాల్ మూవీలో రెజ్లర్ గా కనిపించబోతున్నారు ఆమిర్ ఖాన్... ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేశారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం మల్లికా శెరావత్ కి దక్కనుందని సమాచారం.

First Look: A Very Muddy Aamir Khan in Dangal

ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట.

ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్యఅనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

English summary
Aamir Khan tweeted the first poster of his upcoming movie Dangal on Monday, featuring his face emerging from what is significantly suggestive of a mud-wrestling pit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu