»   » సినిమా పేరు లేకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్: అసలు PSPK పోస్టర్‌లో ఏముందీ??

సినిమా పేరు లేకుండానే ఫస్ట్ లుక్ రిలీజ్: అసలు PSPK పోస్టర్‌లో ఏముందీ??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan's New Movie First Look Out

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'కాటమరాయుడు' సినిమా డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్.

టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు

టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు

సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదనే విషయం తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరి కలయికలో రూపొందిన గత సినిమాలన్నీ మంచి హిట్లు కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే త్రివిక్రమ్ కూడా సినిమాను అన్ని హంగులతో చాలా పకడ్బంధీగా రూపొందిస్తున్నారు.

సినిమా పేరు లేకుండా

సినిమా పేరు లేకుండా

సినిమా పేరు లేకుండా కాన్సెప్ట్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఐతే ఈ పోస్టర్ చూశాక ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటబ్బా అని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు అభిమానులు. ఓవైపు పవన్ దీర్ఘాలోచనలో కనిపిస్తుంటే.. ఇంకోవైపు ఎటో నడుస్తున్నట్లుగా చూపించారు.

కాన్సెప్ట్ ఏంటన్నది అంచనా వేయడం

కాన్సెప్ట్ ఏంటన్నది అంచనా వేయడం

బ్యాగ్రౌండ్లో మ్యాచ్ కనిపిస్తోంది. దీన్ని బట్టి కాన్సెప్ట్ ఏంటన్నది అంచనా వేయడం జనాలకు కష్టంగానే ఉంది. ఈ పోస్టర్ చూసి ఎవరికి నచ్చినట్లు.. ఎవరికి అర్థమైనట్లు వాళ్లు భాష్యం చెబుతున్నారు.రాబిన్ శర్మ రాసిన "ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెర్రారి" లా ఉందంటూ అంతమూ కనిపించింది.

యోగి లాగా

యోగి లాగా

తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక మనిషి కథ ఇది అని కొందరు.. అన్నీ వదిలేసి ఒక యోగి లాగా అడుగులేస్తున్న వ్యక్తి కథ అని మరికొందరు.. తన ఆలోచనల వెంట పయనిస్తున్న వ్యక్తి ప్రయాణం అని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా ఈ పోస్టర్ ను విశ్లేషించే ప్రయత్నం చేశారు.

కాన్సెప్ట్ లేకపోవవడమే

కాన్సెప్ట్ లేకపోవవడమే

వీటన్నింటికీ భిన్నంగా ఏ కాన్సెప్ట్ లేకపోవవడమే ఆ కాన్సెప్ట్ పోస్టర్ కాన్సెప్ట్ అంటూ కొందరు సెటైర్లు కూడా వేశారు. దీంతో పాటుగా ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న అనిరుధ్ రవిచందర్.. పవన్ కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 3 గంటలకు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసారట.

English summary
Not really the first look and aptly titled as concept poster, the first official image from Powerstar Pawan Kalyan’s next is out.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu