»   » ‘జై లవ కుశ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.... రేటింగ్ చాలా తేడాగా ఉంది!

‘జై లవ కుశ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.... రేటింగ్ చాలా తేడాగా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa First Review : ‘జై లవ కుశ’ఫస్ట్ రివ్యూ : రేటింగ్ ఏంటో కొంచెం తేడాగా ఉంది|

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం రేపు(సెప్టెంబర్ 21) విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇండియాలో సెన్సార్ బోర్డు వారు యూ/ఎ రేటింగ్ తో సర్టిఫై చేశారు. ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం భారీగా విడుదలవ్వబోతోంది. ఆయా దేశాల్లో కూడా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఉమైర్ సంధు రివ్యూ

ఉమైర్ సంధు రివ్యూ

విదేశాల్లో ఇండియన్ సినిమాల క్రిటిక్‌గా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ బాలీవుడ్, సౌత్ సినిమాలు ఇండియాలో రిలీజ్ కాక ముందే అందరికంటే ముందే ఫస్ట్ రివ్యూలు ఇస్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జై లవ కుశ' పై కూడా ఓ రివ్యూ వదిలాడు.


డబ్బా రివ్యూలు అనే విమర్శ

డబ్బా రివ్యూలు అనే విమర్శ

ఉమైర్ సంధు రివ్యూలపై డబ్బా రివ్యూలు అనే విమర్శ ఉంది. ‘ట్యూబ్ లైట్' లాంటి పరమ ప్లాపు సినిమాలకు కూడా భారీగా రేటింగ్ ఇస్తూ డబ్బాలు కొడుతూ రివ్యూలు రాయడం ఇతడికే చెల్లిందని అనే వారూ ఉన్నారు. అలాంటి డబ్బా రివ్యూల ఉమైర్ సంధు ‘జై లవ కుశ' మీద కూడా ఓ రివ్యూ వేశాడు. సినిమాపై అతడు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాడు అనేది ఓసారి చూద్దాం.


సినిమాలో హైలెట్స్ ఇవేనంట

సినిమాలో హైలెట్స్ ఇవేనంట

సినిమాలోని కీలకమైన సీన్లలో డైలాగ్స్ చాలా బావున్నాయని, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ అయిందని చెప్పుకొచ్చాడు. దేవి అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు కూడా చాలా ప్లస్సయిందని తెలిపాడు.


కొన్ని చోట్ల చాలా లాగారట

కొన్ని చోట్ల చాలా లాగారట

సినిమాలో కొన్ని చోట్ల సీన్లు చాలా లాగారని, ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుండేదని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. అయితే స్క్రీన్ ప్లే రేసీగా, సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉందని తెలిపాడు.


మాస్ మూమెంట్స్

మాస్ మూమెంట్స్

దర్శకుడు కెఎస్ రవీంద్ర డిటెక్షన్ ఫస్ట్ రేట్ గా ఉందని, స్టోరీ, స్క్రీన్ ప్లే లో చాలా మాస్ మూమెంట్స్ ఉన్నాయని ఉమైర్ సంధు తెలిపారు.


స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయట

స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయట

అయితే స్టోరీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయంటూ రాసుకొచ్చిన ఉమైర్ సంధు...ఓవరాల్ గా ‘జై లవ కుశ' చిత్రం పైసా వసూల్ చిత్రం అంటూ కితాబిచ్చాడు.క్లైమాక్స్ గురించి

క్లైమాక్స్ గురించి

సినిమా క్లైమాక్స్ బావుందని, స్టంట్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయని ఉమైర్ సంధు తన రివ్యూలో చెప్పుకొచ్చాడు.


ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, జై, లవ, కుశ పాత్రల్లో వేరియేషన్ అద్భుతంగా చూపాడని.... ఎన్టీఆర్ నటన పరంగా అదరగొట్టాడని ఉమైర్ సందు తెలిపారు.


ఫ్యాన్స్ కు పండగే

ఫ్యాన్స్ కు పండగే

ఎన్టీఆర్‌ను మూడు పాత్రల్లో చూడటం ఎన్టీఆర్ కు పండగలా ఉంటుందని, కొన్ని పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ అందరినీ మెప్పిస్తుందని ఉమైర్ సంధు ప్రశంసించారు.


ఇతర నటీనటుల గురించి

ఇతర నటీనటుల గురించి

ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్ చాలా బాగా చేశారు. అదే విధంగా సహాయ నటులు బాగా నటించారు. రోనిత్ రాయ్ అదరగొట్టాడు అంటూ ఉమైర్ సంధు తన రివ్యూలో తెలిపారు.


ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఓవరాల్ గా ఈ సినిమాలోని కామెడీ, యాక్షన్ డ్రామా అభిమానులను, ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని, తన అభిప్రాయంలో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది, ష్యూర్ షాట్ హిట్.. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ ఉమైర్ సంధు తన రివ్యూలో చెప్పుకొచ్చాడు.


రేటింగే చాలా తేడా

రేటింగే చాలా తేడా

ఉమైర్ సంధు ఇచ్చిన రేటింగే చాలా తేడా ఉందని అంటున్నారు. టాలీవుడ్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు 4 రేటింగ్ ఇచ్చిన సంధూ.... ఈ సినిమాకు 3.5 రేటింగ్ మాత్రమే ఇవ్వడం చర్చనీయాంశం అయింది.English summary
"Overall It will impress Jr. NTR fans and the audience that likes Comedy action dramas ! As per me ! It will ROCK the Boxoffice ! Sure Shot HIT. A PURE FAMILY ENTERTAINER" First Review Jai Lava Kusa by Umair Sandhu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu