»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది (5 స్టార్ రేటింగ్)

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది (5 స్టార్ రేటింగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్.... తొలి రివ్యూ వచ్చేసింది. ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కాలేదు, కనీసం బెనిఫిట్ షోలు కూడా పడలేదు... అప్పుడే సినిమా ఎవరు చూసారు? రేటింగ్ ఎలా ఇచ్చారు అని అనుకుంటున్నారా... ఈ రివ్యూ రాసింది ఉమైర్ సంధు. ఇండియన్ మేగజైన్ యూకె & యూఏఇ ఎడిటర్. యూకె సెన్సార్ బోర్డ్‌లో ఈయన సభ్యుడు కూడా. మిడిల్ ఈస్ట్, యూకెలలో ఇండియన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు.

యూకె సెన్సార్ బోర్డు ముందుకు సినిమా వచ్చినపుడు ఈయన కూడా సినిమా చూసారు. అనంతరం ట్వీట్ల రూపంలో తన రివ్యూ రాసారు. ఈయన సినిమా గురించి రాసిన రివ్యూ ట్వీట్స్ ఇపుడు ఫ్యాన్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు ఆయన ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.


రివ్యూలో ఏం రాసారంటే...
'సర్దార్ గబ్బర్ సింగ్ పైసా వసూల్ మూవీ. పవన్ కళ్యాణ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది వన్ మ్యాన్ షో. అవార్డులు కొల్లగొట్టే రేంజిలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత కాజల్ అగర్వాల్ అద్భుతంగా కనిపించింది. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఆమె కెమిస్ట్రీ రాకింగ్. విలన్ గా శరద్ కేల్కర్ పెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిఎస్పీ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ అన్నీ చార్ట్‌బర్టర్సే... సినిమా ఫస్టాఫ్ టెర్రిఫిక్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా క్లాస్ గా ఉంది. సింపుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, క్రిస్పీ ఎడిటింగ్, చప్పట్లు కొట్టే రేంజిలో డైలాగ్స్...ఉత్కంఠ పుట్టించే యాక్షన్ స్టంట్....స్ట్రాంగ్లీ రికమండెడ్ మూవీ. అందుకే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాం' అంటూ ఉమైర్ సంధు తన రివ్యూలో రాసారు.


అయితే ఈయన సినిమా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వన్ సైడ్ రివ్యూ రాసి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈయనగారి రివ్యూ చదివి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అసలు రివ్యూలు రేపు ఉదయం బయటకు రానున్నాయి. సినిమా హిట్టా, ఫట్టా అనేది రేపు తేలిపోతుంది.


స్లైడ్ షోలో ఉమైర్ సంధు రివ్యూ ట్వీట్స్...


ఉమైర్ సంధు రివ్యూ..

ఉమైర్ సంధు రివ్యూ..


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అదిరిపోయింది అంటూ ఉమైర్ సంధు 5 స్టార్ రేటింగ్ రివ్యూ..


బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుంది

బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుంది


బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే సత్తా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి ఉందంటూ ట్వీట్.


కింగ్ ఆఫ్ టాలీవుడ్

కింగ్ ఆఫ్ టాలీవుడ్


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ క ళ్యాణ్ కింగ్ ఆఫ్ టాలీవుడ్ అని తేలిపోతుందన్నారు.


డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు

డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా నమ్మకంగా ఉన్నారంటూ ట్వీట్.


రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు..

రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు..


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం రికార్డు స్థాయిలో 250 బోనిఫిట్ షోలు వేస్తున్నారు.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


42 దేశాల్లోఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


100 నుండి 120 కోట్లు

100 నుండి 120 కోట్లు


సినిమా వసూళ్లు రూ. 100 నుండి 120 కోట్ల మద్యలో ఉంటుందని అంచనా.


పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవబోతోంది.


ఇప్పటికే..

ఇప్పటికే..


ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 100 కోట్ల వరకు జరిగిందని అంచనా.


అసలు రివ్యూలు రేపు

అసలు రివ్యూలు రేపు


సినిమాకు సంబంధించిన అసలు సిసలైన రివ్యూలు రేపు వెలువడనున్నాయి. సినిమా హిట్టో ఫట్టో ఆ రివ్యూలతో తేలిపోతుంది.


English summary
Umair Sandhu, who is apparently the editor at Indian Cinema Magazine UK & UAE, member of UK censor board and a film distributor in Middle East & UK, claims to have watched Powerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh in a special screening. Though the authenticity remain doubtful, as special shows in overseas stands a rare chance, this first ever review of Sardaar Gabbar Singh is now going viral among the fan clubs, for the obvious reasons. According to him, Sardaar deserves 5/5 stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu