twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ టాక్: శ్రీను వైట్ల మార్క్, బాద్‌షా అదిరిందా!

    By Pratap
    |

    హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బాద్‌షా సినిమా శ్రీను వైట్ల మార్కుతో వినోదాన్ని గ్యారంటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. సినిమాపై ఫస్ట్ టాక్ అప్పుడే ప్రారంభమైంది. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే గ్యారంటీ ఇస్తున్నారు. శ్రీను వైట్ల మార్కు ఎన్టీఆర్ అగ్రెసివ్, కామెడీ ట్రాక్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు.

    కథేమిటి...

    ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌లో బాద్‌షా (జూనియర్ ఎన్టీఆర్) అందరికన్నా చిన్నవాడు. అగ్రెసివ్‌గా ఉంటాడు. ఆ క్రైమ్ సిండికేట్‌కు నాయకుడు సాధూ భాయ్ (కెల్లీ దోర్జీ). బాద్‌షా తండ్రి రంజన్ (ముకేష్ రుషి) కాసినో నడుపుతుంటాడు. సాధు భాయ్‌కి అత్యంత విశ్వాసపాత్రుడు. బాద్‌షా తెలివితేటలు, దూకుడు వంటి కారణాలు సాధు భాయ్‌తో గొడవలకు దారి తీస్తాయి. దాంతో బాద్‌షాను అంతం చేయాలని సాధూ బాయ్ ప్రయత్నిస్తాడు.

    సాధూ భాయ్ వ్యతిరేక ముఠా నాయకులు క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వాయిలెంట్ విక్టర్ (ప్రదీప్ రావత్) సహాయంతో బాద్‌షాను అంతం చేయించడానికి వ్యూహరచన చేస్తాడు. అంతేకాకుండా, భారతదేశంలో సాధు పెద్ద యెత్తున పేలుళ్లకు కుట్ర చేస్తాడు. సాధు కుట్రలను భగ్నం చేస్తానని బాద్‌షా ప్రతిజ్ఞ చేస్తాడు. జానకి (కాజల్), ఆమె తండ్రి జయకృష్ణ సింహాల సాయాన్ని బాద్‌షా తీసుకుంటాడు.

    జయకృష్ణ సింహా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉంటాడు. ఆయనది ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో పద్మనాభ సింహా కూడా సభ్యుడు. కథ ముందుకు నడుస్తున్న కొద్దీ బాద్‌షా ఎవరనేది క్లియరవుతూ పోతుంది. బాద్‌షా గత విషాదం ఏమిటి, సాధుపై ఎందుకు పగ తీర్చుకోవాలని అనుకుంటాడు, బాద్‌షా ప్లాన్‌లో పద్మనాభ సింహా ఎలా పాలు పంచుకుంటాడు అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సింది.

    Baadshah

    ఎన్టీఆర్ అదరగొట్టాడు..

    బాద్‌షాగా ఎన్టీఆర్ కొత్త గెటప్‌తోనే కాకుండా దూకుడైన నటనతో అదరగొట్టినట్లు సమాచారం. దూకుడు, కఠినత్వం, స్టయిల్ ఈ పాత్ర లక్షణాలు. కాజల్‌తో కలిసి ఎన్టీఆర్ హాస్యాన్ని కూడా పండించాడట. అది అత్యంత వినోదాత్మకంగా ఉందని అంటున్నారు. సినిమా సెకండాఫ్‌లో ఎన్టీఆర్ అతి సునాయసంగా మరొకరి పాత్రలో ఒదిగిపోయాడని అంటున్నారు. రంగోలి రంగోలీ, సైరో సైరో పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్స్‌లను విరగదీశాడట.

    జస్టిస్ చౌదరి గెటప్‌లో ఎన్టీఆర్..

    కొద్దిసేపు జూనియర్ ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి గెటప్‌లో కనిపిస్తాడని అంటున్నారు. అది తాత ఎన్టీ రామారావును తలపించేట్లుగా ఉందట. సీనియర్ ఎన్టీఆర్ పాపులర్ సాంగ్స్‌కు సెకండాఫ్‌లో వినోదాత్మకమైన సంగీత్ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకుంది.

    మహేష్ బాబు నేపథ్య గళం పలుమార్లు

    సినిమా ఫస్టాఫ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నేపథ్య గళం (వాయిస్ ఓవర్) కీలకమైన సందర్భాల్లో వస్తుంది. అది అత్యంత ప్రతిభావంతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్‌స్పెక్టర్ పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మానందం నవ్వుపూలు పూయించినట్లు చెబుతున్నారు. ఎంఎస్ నారాయణ రివేంజ్ నాగేశ్వర రావు పాత్రలో హాస్యాన్ని పండించాడు. ఈ పాత్ర రామ్ గోపాల్ వర్మను తలపిస్తుంది. అయితే, ఇది ఆయనను నొప్పించే విధంగా లేదని అంటున్నారు.

    నవదీప్ కూడా కీలకమైన పాత్ర పోషించాడు. సిద్దార్థ్ పాత్ర కాసేపే ఉన్నా అది అత్యంత కీలకమైంది. సెకండాఫ్ అంతా కామెడీతో సాగుతుంది. అయితే, శ్రీను వైట్ల పాత ప్రాజెక్టులను గుర్తు తేవడం ఈ సినిమాకు ఓ మైనస్ పాయింట్. అయితే, వేసవిలో వినోదాన్ని తప్పకుండా ఈ సినిమా అందిస్తుందని, ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

    English summary
    Jr NTR and Kajal paired Srinu Vaitla's ‘Baadshah’ is generating tremendous buzz in tollywood and creating tremedous interest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X