»   » కత్రినా కైఫ్ ‘ఫితూర్’ (అఫీషియల్ ట్రైలర్)

కత్రినా కైఫ్ ‘ఫితూర్’ (అఫీషియల్ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' చిత్రంలో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా. ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ట్రైలర్లో కత్రినా, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య సీన్లు రొమాంటిక్ గా ఉన్నాయి. పితూర్ మూవీలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో టబు నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు బేగం. ఈ సినిమాను ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రేమికుల రోజు ఉండటంతో ఈ చిత్రానికి ప్రేమికులు, యువత నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సినిమాలో రిమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుండటం కూడా యువతలో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.

స్క్రిప్టు డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని హాట్ అండ్ సెక్సీ బెడ్రూం సీన్లు ఉన్నాయి. ఎక్కువ టేకులు తీసుకోకుండా సీన్లు పర్ ఫెక్టుగా రావడానికి కత్రినా, ఆదిత్య రాయ్ కపూర్ కు ప్రాక్టీస్ అవసరం అని భావించిన దర్శకుడు ఇద్దరినీ సెపరేట్ రూమ్ లో ప్రాక్టీస్ చేయించాడట.

అన్ని సిద్ధం చేసుకుని కెమెరా ఆన్ చేసిన తర్వాత రొమాంటిక్ సీన్లు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారట కత్రినా, ఆదిత్య. టేకుల మీద టేకులు తీసుకున్నారు. ఈ రొమాంటిక్ సీన్లు పూర్తయ్యే సరికి ఏకంగా 12 గంటలకు పైగా సమయం పట్టిందట. ఇందులో ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్లు కూడా ఉన్నాయి.

English summary
UTV Motion Pictures in association with Guy In The Sky Pictures presents Fitoor starring Aditya Roy Kapur, Katrina Kaif and Tabu. The film is directed by Abhishek Kapoor and releases on February 12, 2016.
Please Wait while comments are loading...