»   » ఒక్క సినిమాకి ఐదు క్లైమ్యాక్స్ లా..!? రానా "ఘాజీ" ని కొంటున్న ప్రభాస్

ఒక్క సినిమాకి ఐదు క్లైమ్యాక్స్ లా..!? రానా "ఘాజీ" ని కొంటున్న ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఘాజీ.. గత కొంత కాలంగా ఈ పేరు చర్చనీయాంశమవుతోంది. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇండియాలో తెరకెక్కిన తొలి సబ్ మెరైన్ వార్ మూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు మన విశాఖపట్నంలో నెలకొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో 'ఘాజీ' పేరుతో ఒక పుస్తకం రాసి.. దాన్నే సినిమా తెరకెక్కిస్తున్నాడు అరంగేట్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

  ఇదిలాఉంటే పీరియాడిక్‌ చిత్రంగా తెరకెక్కిన 'ఘాజీ' కోసం ఏకంగా ఐదు క్లైమాక్స్‌లను రాసుకున్నాడట దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. ఆ తరువాత ఆ క్లైమాక్స్‌లను యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్‌ను ఫైనల్ చేసి దాన్నే సినిమాలో చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  మొత్తం నీటి అడుగున :

  మొత్తం నీటి అడుగున :

  బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రం కావడం, మొత్తం నీటి అడుగున తీసిన చిత్రంగా నిలవడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్బం లో ఘాజీ విశేషాలు మరి కొన్ని....

  క్లీన్ యు స‌ర్టిఫికెట్ :

  క్లీన్ యు స‌ర్టిఫికెట్ :

  సంకల్ప్ దర్శకత్వంలో రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. 1970లో జరిగిన య‌దార్థ యుద్ధ గాథ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. దీన్ని పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా 'ఘాజీ' చిత్రం ఈమధ్యే సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్ బోర్డు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో సినిమాను ఈ నెల 17వ తేదీన విడుద‌ల చేస్తున్నారు.

  భారత-పాకిస్థాన్‌ యుద్ధం:

  భారత-పాకిస్థాన్‌ యుద్ధం:

  1971లో జరిగిన భారత-పాకిస్థాన్‌ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలక పాత్ర పోషించింది. విశాఖపట్నంలోని ఈస్ట్రన్‌ కమాండ్‌ అధీనంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత అనే యుద్ధ నౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయటానికి.. పాకిస్థాన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ అనే ఒక జలాంతర్గామిని విశాఖపట్నానికి పంపింది.

  పాక్‌ సైన్యం:

  పాక్‌ సైన్యం:

  అప్పట్లో పాక్‌ దగ్గర నాలుగు జలాంతర్గాములు ఉండేవి. ఐఎన్‌ఎస్‌ విక్రాంతను దెబ్బతీయగలిగితే.. యుద్ధంలో పై చేయి సాధించవచ్చని పాక్‌ సైన్యం చాలా ఆశలు పెట్టుకుంది. ఐఎన్ఎస్ ఘాజీ అత్యంత రహస్యంగా.. భారతీయ నౌకలకు చిక్కకుండా విశాఖపట్నం సమీపానికి చేరుకుంది.

  ఐఎన్‌ఎస్‌ విక్రాంత :

  ఐఎన్‌ఎస్‌ విక్రాంత :

  కానీ అప్పటికే ఐఎన్‌ఎస్‌ విక్రాంత విశాఖతీరాన్ని వదిలివెళ్లిపోయింది. దీంతో ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేని ఘాజీ.. విశాఖపట్నం సమీపంలో ఉన్న నౌకలపై దాడులు చేయటానికి విఫలయత్నాలు చేసింది. చివరికి ఆ నౌకే పేలిపోయింది. 1971 డిసెంబర్‌ 3వ తేదీన ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అనే యుద్ధ నౌక పహారా కాయడానికి వెళ్లినప్పుడు ఘాజీ శకలాలు దొరికాయి.

  మన నౌకా దళమే :

  మన నౌకా దళమే :

  మరి ఘాజీని మన వాళ్లే పేల్చారా.. దానంతట అదే పేలిపోయిందా అన్నదానిపై స్పష్టత లేదు. తాము ఘాజీని పేల్చివేశామని మన నౌకాదళం ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ‘ఘాజీ' సినిమాలో మాత్రం మన నౌకా దళమే ఘాజీని పేల్చేసినట్లు చూపిస్తారని అర్థమైంది. ఈ ఘాజీ కథకు సంబంధించి ఐదు రకాల వెర్షన్లు ఉన్నాయట. ఐతే వాటన్నింటినీ గుదిగుచ్చి.. సంకల్ప్ ఈ కథ తయారు చేశాడని అంటున్నాడు రానా.

  రెబెల్ స్టార్ ప్రభాస్:

  రెబెల్ స్టార్ ప్రభాస్:

  ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.

  బాహుబలి తర్వాత :

  బాహుబలి తర్వాత :

  పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీవీపీకి సుమారు రూ.2 కోట్ల వరకు చెల్లించి ఆ సినిమా ఓవర్సీస్ హక్కులను ఈ బాహుబలి దక్కించుకున్నాడట. బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రం కావడం, మొత్తం నీటి అడుగున తీసిన చిత్రంగా నిలవడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

  English summary
  However, one director came up with not one but five climaxes for his story. He is Sankalp Reddy and the film is ‘Ghazi’. It is heard that Sankalp who also wrote the book about the Pakistani submarine came up with five different versions on how the story ends.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more