వెంకటేష్ సరసన ఐదుగురు హీరోయిన్స్
ఆప్త రక్షక రీమేక్ లో చేస్తున్న వెంకటేష్ సరసన ఐదుగురు హీరోయిన్స్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారు అనూష్క, ప్రియమణి, శ్రధ్దాదాస్, స్నేహ, మమతా మోహన్ దాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మాత బెల్లంకొండ సురేష్ వారిని సంప్రదిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కనపడే పురాతన కాలం ఇల్లు కోసం బ్యాంకాక్ లోని ఓ మాన్షన్ ని అద్దెకు తీసుకోనున్నారు. పి వాసు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని చంద్రముఖి సీక్వెల్ అని వ్యవహిస్తున్నారు. ఇంకా దీనికి టైటిల్ ఏమీ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయిస్తున్నారు. కామిడీ సన్నివేశాలు ఇక్కడ నేటివిటికీ తగ్గట్లు మార్చి బ్రహ్మానందంపై చిత్రీకరించటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్ నమో వెంకటేశ అనుష్క ప్రియమణి శ్రధ్దాదాస్ స్నేహ మమతా మోహన్ దాస్ ఆప్త రక్షక venkatesh namo venkatesa anushka priyamani sneha apta rakshaka


Click it and Unblock the Notifications