»   » బాహుబలి-2లో ఐదు తప్పులు..... ఎత్తి చూపిన తమిళ దర్శకుడు!

బాహుబలి-2లో ఐదు తప్పులు..... ఎత్తి చూపిన తమిళ దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2 మూవీ ఇటీవల విడుదలై మెగాబ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. సినిమాపై అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. థియేటర్ కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు ఓ గొప్ప సినిమా చూసామనే ఆనందంతో తిరిగి వస్తున్నాడు.

అయితే ఓ తమిళ దర్శకుడు 'బాహుబలి-2' మూవీలో ఐదు తప్పులు ఉన్నాయంటూ.... వాటిని ఎత్తి చూపుతూ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ దర్శకుడు ఎవరో కాదు నయనతార ప్రేమికుడిగా ఇటీవలి కాలంలో వార్తల్లోకి ఎక్కిన విఘేష్ శివన్.


తప్పులు అంటూనే పొగడ్తలు

తప్పులు అంటూనే పొగడ్తలు

వాస్తవానికి విఘ్నేష్ శివన్ తప్పులు అని పేర్కొన్నవన్నీ పొగడ్తలే. తప్పులు అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన అందరినీ ఆకర్షించాడు.


కేవలం 120 రూపాయలేనా?

కేవలం 120 రూపాయలేనా?

ఇలాంటి గొప్ప సినిమాను చూడటానికి కేవలం రూ. 120 టికెట్ మాత్రమే సరిపోదు. థియేటర్ల వద్ద కలెక్షన్ బాక్సు పెట్టాలి. లేదంటే ప్రొడ్యూసర్ అకౌంట్ నెంబర్ గానీ, అడ్రస్ గానీ ఇవ్వాలి... ఇలాంటి ఏర్పాటు చేయకపోవడం తప్పే అంటూ విఘ్నేష్ శివన్ ట్వీట్ చేసాడు.


చాలా తక్కువగా ఉంది

చాలా తక్కువగా ఉంది

సినిమా నిడివి చాలా తక్కువగా ఉంది. కేవలం మూడు గంటల్లోనే ఈ సినిమా ముగియడం ఎవరికీ నచ్చడం లేదు. సినిమాను మరింత పెద్దగా తీయక పోవడం కూడా తప్పే అంటూ విఘ్నేష్ శివన్ ట్వీట్ చేసాడు.


వాళ్లంతా తగ్గించుకోవాలి

వాళ్లంతా తగ్గించుకోవాలి

టూ మ‌చ్ డిటెయిలింగ్ అండ్ ప‌ర్‌ఫెక్ష‌న్‌. ఈ దెబ్బ‌తో తాము గొప్ప‌వాళ్ల‌మ‌ని విర్ర‌వీగే ద‌ర్శ‌కులంద‌రూ త‌మ హెడ్ వెయిట్‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.


ఇంకా ఉండాలి

ఇంకా ఉండాలి

బాహుబలి సిరీస్ లో ఇదే చివ‌రి సినిమా అవ‌డానికి వీల్లేదు. ఈ సిరీస్‌లో మ‌రో ప‌ది సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నాం. స్క్రీన్ మీద మరిన్ని అద్భుతాలు, మిరాకిల్స్ చూడాలని కోరుకుంటున్నామని విఘ్నేష్ శివన్ తెలిపారు.
కష్టమే..

కష్టమే..

బాహుబలి మూవీ క్రియేట్ చేసిన బెంచ్ మార్కును అందుకోవడం, రికార్డులను బద్దలు కొట్టడం చాలా కష్టం. ఇలాంటి జరుగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది అని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.English summary
Director Vignesh Shivan has lauded Rajamouli in an interesting by pointing out five mistakes in the film that has smashed the box office records worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu