twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2009 టాప్ గ్రాసర్స్ సౌత్ ఫిల్మ్స్ లిస్ట్

    By Srikanya
    |

    తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో టాప్ గ్రాసర్ గా నిలిచిన పది చిత్రాలను ఎంపిక చేయటం జరిగింది. అందులో మొదటగా రామ్ చరణ్ తేజ, కాజల్ నటించిన 'మగధీర' వచ్చింది. దాదాపు 75కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేసి అందరికీ ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాతో కాజల్ బాగా బిజీ అయ్యింది. రాజమౌళి ఎటువంటి సబ్జెక్టును అయినా సమర్ధవంతంగా డీల్ చేయగలడనే పేరు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ ని తిరుగులేని స్టార్ గా రెండో సినిమాగా మార్చిన ఘనత మగధీర చిత్రానిది.

    ఆ తర్వాత ప్లేస్ లో అనూష్క నటించిన 'అరుంధతి' చిత్రం నిలిచింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించింన ఈ చిత్రం దాదాపు అరవై కోట్ల రూపాయలు లాభాల్ని తెచ్చిపెట్టింది. హీరోయిన్ అనూష్కను,విలన్ పాత్రధారి సోనూసూద్ ని బిజీ స్టార్ ని చేసింది. ఫేడ్ అవుట్ అయిన దర్శకుడు కోడి రామకృష్ణను మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చింది.

    మూడో ప్లేసులో సురేంద్రరెడ్డి డైరక్ట్ చేసిన 'కిక్' చిత్రం నిలిచింది. రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం 18కోట్లతో నిర్మాణ మయి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రంతో రవితేజకు మరో హిట్ వచ్చింది. ఫ్లాపుల్లో ఉన్న సురేంద్రరెడ్డి ఊపిరి పీల్చుకుని మళ్ళీ మహేష్ వంటి స్టార్స్ తో బిజీ అవుతున్నారు. ఇలియానాకు మరో సారి మంచి డిమాండ్ వచ్చింది. టోటల్ గా బ్రహ్మానందంపై దర్శక, నిర్మాతలకు మరింత నమ్మకం వచ్చింది.

    ఇక తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఆయన్'(తమిళ చిత్రం)నిలుస్తోంది. తమన్నా, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ముప్పై ఐదు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఎవియం వారు నిర్మించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుని ఇంత భారీగా వసూలు చేయటం అందరినీ అప్పట్లో ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం తెలుగులోనూ ఫరవాలేదనిపించుకుని కలెక్షన్స్ బాగానే తెచ్చుకుంది. తమిళంలో అయితే రజనీ..శివాజి, కమల్..దశావతారం తర్వాత దీన్నే బిగ్గెస్ట్ హిట్ గా అక్కడ పేర్కొంటున్నారు.

    ఆ తర్వాత 'నాడోడిగల్' (తమిళ చిత్రం) వచ్చి చేరింది. సుబ్రమణ్యపురం విజయం సప్రేరణతో తీసిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరక్ట్ చేసారు. పబ్లిసిటీ తో కలిసి ఏడు కోట్ల రూపాయల మినిమం బడ్జెట్ లో వచ్చిన ఈ చిత్రం అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు 22 కోట్ల రూపాయలు సాధించి తెలుగు రీమేక్ కు దారి వేసుకుంది. ఆ దర్శకుడే తెలుగులోనూ దర్శకత్వం ఆఫర్ రావడం మంచి విజయమే. రవితేజ హీరోగా తెలుగులో శంభో శివ శంబో పేరన రీమేక్ చేస్తున్నారు.

    వీటి తర్వాత 'ఎ వెడ్నస్ డే' రీమేక్ (తమిళ,తెలుగు) వెర్షన్ లు వచ్చి చేరుతాయి. రెడ్ కెమెరాను ఈ చిత్రంతో పరిచయం చేసిన కమల్ హాసన్ బడ్జెట్ కంట్రోలుతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా లాభపడ్డారు.

    వీటి తర్వాత 'మనసారే' (కన్నడ చిత్రం) గురించి చెప్పుకోవాలి. యోగిరాజ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అయి అధ్వాన్న స్ధితిలో ఉన్న కన్నడ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది. పూర్తిగా కర్నాటకలో నిర్మింపబడ్డ ఈ చిత్రం రెండున్నర కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరిగి ఐదు కోట్లు సంపాదించి పెట్టింది. దాంతో మరిన్ని చిన్న బడ్జెట్ చిత్రాలకు దారి ఏర్పడింది. ఈ చిత్రం తర్వాత కన్నడంలో చెప్పుకోవాల్సింది రెండు కోట్లతో నిర్మాణమై నాలుగున్నర కోట్లు సంపాదించిన 'అంబారీ' అనే కన్నడ చిత్రం. సంగీతం సూపర్ హిట్ అయి ఈ యావరేజ్ చిత్రాన్ని నిలబెట్టడం విశేషం.

    ఈ చిత్రాల తర్వాత సౌత్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ అయిన మళయాళంలో వచ్చిన 'పజాసీ రాజా' చిత్రం గురించి మాట్లాడాలి. ముమ్మట్టి,శరత్ కుమార్, పద్మ ప్రియ వంటి వారు నటించిన ఈ చిత్రం ఇరవై కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మాణమై కలెక్షన్స్ లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ఓ స్వాతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర కావటం విశేషం. చివరగా 'పుడియా ముఖామ్' అనే మరో మళయాళ చిత్రం ఇరవై కోట్లకు పైగా కలెక్టు చేసిన విషయం చెప్పాలి. ప్రియమణి,పృద్వీరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం పృథ్వీరాజ్ ను పూర్తి స్ధాయి బిజీ చేసింది. అతని ఫ్యాన్ క్లబ్ లు రెట్టింపు అయ్యాయి. అదీ ఈ 2009 సౌత్ సినిమా కలెక్షన్స్ పరిస్ధితి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X