For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2017: ప్రభాస్ అండ్ క్రేజీ ఫ్యాన్స్... దేశ వ్యాప్తంగా ఓ సంచలనం!

  By Bojja Kumar
  |

  2017 సంవత్సరంలో అందరి కంటే ఎక్కువ పాపులర్ అయిన హీరో ఎవరు అంటే... ప్రతి ఒక్కరూ తడుముకోకుండా చెప్పే పేరు ప్రభాస్. ఈ సంవత్సరంలో ప్రభాస్ సంపాదించినంత పేరు ప్రఖ్యాతలు, ఫ్యాన్ ఫాలోయింగ్ మరే తెలుగు హీరో సంపాదించలేదని చెప్పాలి. 2017 సంవత్సరం ప్రభాస్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ ఇన్సిడెంట్స్ గురించి, ఇంటర్నెట్లో అవి ఎంతలా పాపులర్ అయ్యాయో ఓ సారి లుక్కేద్దాం.

   అహ్మదాబాద్‌లో లేడీ పోలీస్

  అహ్మదాబాద్‌లో లేడీ పోలీస్

  అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచికి చెందిన ఓ లేడీ పోలీస్ తాను ఎంతగానో అభిమానించే ప్రభాస్ పుట్టినరోజును కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది. ప్రభాస్‌కు వీరాభిమాని అయిన ఆమె తన అభిమాన స్టార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ తన జీవితమని, ఎన్నో బాధలను అనుభవించిన తాను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్ సినిమాలు చూసి స్వాంతన పొందేదాన్నని తెలిపారు. తెరపై ఆయన్ను చూస్తే బాధలన్నీ మరచిపోయేదాన్నని ఆమె వ్యాఖ్యానించారు. స్క్రీన్‌పై ప్రభాస్‌ను చూడగానే తనకెంతో ఆనందం కలుగుతుందని, అతనే తనకు ప్రేరణని తెలిపారు.

  పంజాబ్‌లో అభిమానులు ఏం చేశారంటే...

  పంజాబ్‌లో అభిమానులు ఏం చేశారంటే...

  తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు అభిమానులు ఉండటం మామలే. కానీ బాహుబలి సినిమాతో పంజాబ్ లో కూడా ప్రభాస్ కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. బాహుబలి సినిమా రిలీజ్ సందర్భంగా జలంధర్‌లో 600 అడుగుల పొడవైన భారీ పోస్టర్ ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకున్నారు.

   బాహుబలి థాలి

  బాహుబలి థాలి

  గుజరాత్‌లోని రాజ్‌వాడు అనే రెస్టారెంట్ ఓనర్లు రాజేష్ పటేల్, మనీష్ పటేల్ బాహుబలి సినిమా చూసి అభిమానులు అయిపోయారు. తమ రెస్టారెంటులో వడ్డించే ఆహార పదార్థాల్లో బాహుబలి థాలి పేరుతో స్పెషల్ డిష్ చేర్చారు. పేరుకు తగిన విధంగానే ఈ థాలీ భారీగా ఉంది.. పూణెలో కూడా బాహుబలి పేరుతో ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి.

  ప్రభాస్ పెళ్లిరికార్డు స్థాయిలో మ్యారేజ్ ప్రపోజల్స్

  ప్రభాస్ పెళ్లిరికార్డు స్థాయిలో మ్యారేజ్ ప్రపోజల్స్

  ఇండియన్ హీరోల్లో ప్రభాస్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. బాహుబలి సినిమా చూసి అతడికి అభిమానులైన అమ్మాయిలు.... ప్రభాస్ కు ఇంకా పెళ్లి కాలేదనే విషయం తెలిసి పెళ్లి ప్రపోజల్స్ పంపారు. పదులు, వందల్లో కాదు... వేలల్లో అమ్మాయిలు ప్రభాస్ కు పెళ్లి ప్రపోజల్స్ పంపడం హాట్ టాపిక్ అయింది.

   సెల్ఫీ విత్ బాహుబలి

  సెల్ఫీ విత్ బాహుబలి

  ఇటీవల బాహుబలి-ది కంక్లూజన్ వరల్డ్ ప్రీమియర్ పేరుతో సినిమా టీవీలో ప్రదర్శించగా.... అభిమానులు కొన్ని వేల సంఖ్యలో టీవీ ముందు నిల్చుని ప్రభాస్ తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకున్నారు.

   బాహుబలి తరహాలో గణపతి విగ్రహాలు

  బాహుబలి తరహాలో గణపతి విగ్రహాలు

  ఈ ఏడాది జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో బాహుబలి ప్రభాస్ తరహాలో పలు విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు చోట్ల ప్రభాస్ అభిమానులు బాహుబలి గణేష్ విగ్రహాలతో మండపాలు ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకున్నారు.

   బాహుబలి బొమ్మలు కూడా

  బాహుబలి బొమ్మలు కూడా

  బాహుబలి సినిమా విడుదల తర్వాత బాహుబలి బొమ్మలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బాహుబలి వారియర్ రూపంలో ఉన్న ప్రభాస్ బొమ్మలను అభిమానులు కొనడం ప్రారంభించారు. ఏది ఏమైనా బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

  సాహో మూవీ

  సాహో మూవీ

  ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ స్థాయి పెరగడతో ఈ చిత్రానని తెలుగుతో పాటు, హిందీ, తమిళంలో కూడా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్. సుజీత్ దర్శకుడు.

  English summary
  Baahubali star Prabhas has made the nation go crazy with his magnum opus personality and Indian Prince charming attitude. Let's have a look at some of his unbelievable fan madness taken place over the year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X