»   » బెంగళూరులో రోబో హావా..!

బెంగళూరులో రోబో హావా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో' భారతీయ 'వెండితెరఆద్భుతం' గా ప్రపంచంమొత్తం ఎదురుచూస్తోంది. బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్ష్ లు రోబో టికెట్ ను 800 రూపాయల వరకూ అమ్ముతూ విడుదలకు ముందు క్రేజ్ ను సొమ్ము చేసుకుంటున్నాయి. రజినీకాంత్ అభిమానులు మాత్రం డబ్బులతో సంబంధం లేకుండా రోబో సినిమాను మొదటి రోజే చూసి ఎంజాయ్ చెయ్యాలని ఆత్రుతగా ఉన్నారు. ఇక రోబో కధ విషయానికి వస్తే రజనీకాంత్ డాక్టర్ వశీ అనే పాత్రను పోషించారు. ఆయనో ఓ సైంటిస్టు. ఆయన సమాజానికి ఉపయోగపడాలని తన సామర్ధాన్ని అంతా ఉపయోగించి ఓ ఆండ్రో-హ్యూమనాయిడ్ రోబోని తయారు చేస్తాడు. ఆయన తయారు చేసిన రోబో పాత్ర పేరు చిట్టి. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పాత్ర పేరు సనా. ఆమె ఓ సైన్స్ స్టూడెంట్. డాక్టర్ వంశీతో ప్రేమలో పడుతుంది. ఆమె ఓ ఓల్డేజ్ హోమ్ లో వాలంటీర్ గా పనిచేస్తు ఉంటుంది.

కర్ణాటకలో రోబో, రోబోట్ మరియు ఏ౦ధిరన్ గా మూడుభాషల్లో కలిపి 60 దియేటర్లలో విడుదల అవుతుంది. కానీ కర్ణాటక ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ ఇతర బాష చిత్రాలు 24 కు మించి ఎక్కువ దియేటర్లలో ప్రదర్శించకూడదు అని ప్రకటన విడుదల చేసింది. ఐతే రజినికాంత్ విషయంలో ఇలాంటివన్ని కోంచెం సడలించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో కోట్లు ఖర్చుపెట్టన సినిమాకాబట్టి ఇలాంటి మార్పులు చేయడంలో తప్పులేదని వారు సంజాయిషి ఇచ్చుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 'రోబో' యూరోప్ లోనే అతి పెద్ద సినిమా హాల్ కొల్లోజియం కినో, ఓస్లో(నార్వే) లో విడుదల అవుతుంది. ఆ థియేటర్ సీటింగ్ కెపాసిటీ 975. అంతేకాకుండా నెటిజెన్ లు అందరు రోబో విశ్లేషణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోబో అందరి అంచనాలను ఎంత వరుకు అందుకుంటుందో తెలియాలంటే ఇంకోన్ని గంటలు పాటు ఆగాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu