»   » సెల్ఫీ అడిగిన అభిమాని గూబగుయ్యిమనిపించాడు,ప్రసారం చేయవద్దని మీడియాకు కూడా వార్నింగ్

సెల్ఫీ అడిగిన అభిమాని గూబగుయ్యిమనిపించాడు,ప్రసారం చేయవద్దని మీడియాకు కూడా వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణం గానే సెలబ్రిటీలకు అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక అదే సినీ స్టార్లైతే ఇక చెప్పే పనే లేదు. పబ్లిక్ ఫంక్షన్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా, ఆఖరికి ట్రాఫిక్ జాం అయినా వాళ్ళకనవసరం తమ అభిమాన నటుడు, నటి కనిపించగానే లోకాన్ని మర్చిపోయి వెంట పడతారు. కొన్ని సార్లు సహనం కోల్పోయిన హీరోలు కాళ్ళతో తన్నటం, స్టుపిడ్ ఫెల్లోస్ అనటం మనకు తెలిసిందే... పాపం హీరోయిన్లైతే అది కూడా చేయలేరు అభిమానం పేరుతో ఎంత ఇబ్బంది పెట్టినా సర్దుకు పోతారు... కొన్ని సార్లు అభిమానం మితిమీరితే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు...?

ఇదివరకు ఆటో గాఫుల కోసం ఎగబడే వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్ఫీలు ఎక్కువ అయిపోయాయి. అయితే ఇదే సెల్ఫీ పిచ్చి ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహామ్‌ విషయం లో చిన్న పాటి వివాదానికి దారి తీసింది. బాలీవుడ్ లో జాన్ కి మిస్టర్ కూల్ అనే పేరుంది. చాలా సహనం కలవాడనీ అభుఇమానుల కోసం సమయం కేటాయించి మరీ వాళ్లని సంతోష పెదతాడనీ పేరుంది. అయితే అంతటి కూల్ జాన్ కి కూదా చిరాకు వచ్చింది. కానీ తాజాగా ఈ 'డిష్యూం' స్టార్ ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి.

Force Hero John Abraham slaps a fan who wanted a selfie

సంగతేమిటంటే జాన్ క్రేజీయెస్ట్ సినిమా ఫోస్ కి సీక్వెల్ గా వచ్చిన ఫోర్స్ -2 ట్రైలర్ లాంచింగ్ మొన్న 29 గురువారం రోజున జరిగిబంది. ఈ ఈవెంట్‌ ముగిసిన జాన్ అక్కణ్ణుంచి కదిలాడు. ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి అభిమానులు ఒక్కసారిగా అతడి వద్దకు పరుగెత్తుకొచ్చారు. వరుసగా సెల్ఫీలు తీసుకుంటూ గుంపుగా వచ్చారు అప్పటికే ఒక సారి కింద పడబోయి నిలదొక్కుకున్నాడట జాన్. నెమ్మదిగా వారిని తప్పించుకుంటూ బయటకు వెళ్లపోతున్న జాన్‌ను ఓ అభిమాని హీరోగారి చెయ్యిపట్టి వెనక్కి లాగి మరీ సెల్ఫీ తీసుకోబోయాడట. దీంతో ఒళ్లు మండిన జాన్ అతడి చెంప చెళ్ళు మనిపించాడట అంతే కాదు ఈ సంఘటనను ప్రచురించవద్దని అక్కడున్న మీడియాకు వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడట.

మామూలుగానే మీడియ ఊరుకోదు ఇక ఇంత జరిగాక ఆగుతుందా వార్నింగ్ని ఖాతరు చేయకుండా వరుసగా ఒక రోజుమొత్తం అన్ని చానెళ్ళలోనూ ఇదే వార్త. అయితే ఈ న్యూస్‌ను జాన్ అబ్రహం మాత్రం తీవ్రంగా ఖండించాడు. జాన్ తరపు ప్రతినిథులు తెరపైకి వచ్చి తమ హీరో ఎవ్వరిపైనా చేయి చేసుకోలేదని అనుకోకుండా జరిగిన చిన్న సంఘటనను మీడియా కావాలనే ఇంత రచ్చ చేస్తోందంటూ చెప్పారు. ఇక అన్నిటికంటే కొసమెరుపు గా వినిపించిన షాకింగ్ వార్త ఏమిటంటే జాన్‌తో అనుచితంగా ప్రవర్తించి చెంప పగలగొట్టించుకున్న ఫ్యాన్ జాన్ అబ్రహం ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు కోరాడట.

English summary
Bollywood actor John Abraham is known for his calm and composed behaviour. But the actor was recently in the news for allegedly slapping a fan post the trailer launch of his upcoming film, 'Force 2'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu