»   » తెలుసా?: మన హీరోయిన్స్ లో వీళ్లు విదేశీయులే(ఫొటో ఫీచర్)

తెలుసా?: మన హీరోయిన్స్ లో వీళ్లు విదేశీయులే(ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మన తెరపై చూసి, మనం విజిల్స్ వేసి మెచ్చుకునే వారంతా మన వాళ్ళే కానక్కర్లేదు. గ్లోబులైజేషన్ నేపధ్యంలో ఎక్కడివారు ఎక్కడైనా నటించే వీలు కలికింది. దానికి తోడు ప్రసార మాధ్యమాలు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ దేశాల మధ్య దూరాలు చెరిపేస్తున్నాయి. దాంతో ఎక్కడెక్కడివారు మన తెరపై మెరుస్తున్నారు. మన మనస్సులు గెలుస్తున్నారు.

ఇక్కడ కనిపించే వారంతా విదేశాల్లో పుట్టి పెరిగినవారే. కొందరు పూర్తిగా విదేశీయులైతే కొందరిలో ప్రవహించేది భారతీయ రక్తమే. ఈ ఒక్క కారణం చాలు మన వెండితెరపై కనిపించడానికి. దానికి కొంత అదృష్టం కూడా తోడైందండోయ్‌. నటనలో కొంత మెళకువలు నేర్చుకుని ఇంకొంత కష్టపడ్డారేమో.

బాలీవుడ్‌ వారికి అవకాశాలు కల్పించింది. నటనకు అవకాశం ఉండే పాత్రలే కావచ్చు.. ఐటం సాంగ్స్‌లో వయ్యారాలు ఒలకబోసే అవకాశమే కావచ్చు.. ఏదైతేనేం ఈ వనితలకు హిందీ చిత్రసీమ తలుపులు బార్లా తెరిచింది.

స్లైడ్ షోలో... వారి వివరాలు

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్

ఈమె శ్రీలంక నటి. 2006లో మిస్‌ శ్రీలంక యూనివర్స్‌ కిరీటం చేజిక్కించుకుంది. 2009లో సుజయ్‌ ఘోష్‌ చిత్రం అలాదీన్‌ ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. ఇటీవలే 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ప్రభుదేవాతో కలసి ఒక ఐటం సాంగ్‌ చేసింది.

నర్గీస్‌ ఫక్రీ

నర్గీస్‌ ఫక్రీ

నర్గీస్‌ ఫక్రీ అమెరికన్‌ నటి. ఈమె రాక్‌స్టార్‌ రణబీర్‌ కపూర్‌తో కలసి బాలీవుడ్‌ సినిమాలో నటించింది. అక్షయ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని హరి ఓం ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో రానున్న మూడు సినిమాల్లో నటించనుంది. ఉదయ్‌ చోప్రాతో కలసి డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం ఉంది.

బార్బరా మోరి

బార్బరా మోరి

మెక్సికన్‌ నటి. హృతిక్‌రోషన్‌ సరసన 'కైట్స్‌' చిత్రంలో కన్పించారు. ఇందులో హృతిక్‌ బార్బరామోరిల కెమిస్ట్రీ బాగుందని సినీవర్గాల కథనం.

యానాగుప్తా

యానాగుప్తా

జెకోస్లవేకియా దేశస్తురాలు. 11కుపైగా చిత్రాల్లో నటించారు. 'బాబూజీ జరా ధీరే చలో' అనే ఐటం సాంగ్‌ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

సన్నీలియోన్

సన్నీలియోన్

ఇండో-కెనడియన్‌ అశ్లీల చిత్రాల తార. 'బిగ్‌బాస్‌' ద్వారా ఆరంగేట్రం చేసింది. జిస్మ్‌-2 ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. రాగిణి ఎస్‌.ఎం.ఎస్‌.-2తోపాటు 'లైలా' ఐటం సాంగ్‌ ద్వారా అలరిస్తోంది.

కత్రినాకైఫ్

కత్రినాకైఫ్

ఇండో-బ్రిటిష్‌ నటి. ఈమెను బాలీవుడ్‌లో బార్బీ డాల్‌గా పిలుస్తారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ఖాన్‌తో కలసి పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. రణబీర్‌తో కలసి డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

బ్రిటిష్‌ అందాలరాణి. మోడల్‌ నుంచి నటిగా ఎదిగి 'ఏక్‌ దీవానా థా' చిత్రం ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది.తెలుగు, తమిళ చిత్రాల్లోనూనటిస్తోందీ అందాల భామ.

English summary
Bollywood is well known across the world for its charm,glamor and Stardom, which attracts many of the foreign actress to Indian Cinem Industry. Some of them are making her foot via the item songs such as the best Helen from Burma, Jacqueline Fernandez from Sri Lanka in Housefull, Scarlett Wilson from Britain in Shanghai and the latest Claudia Ciesla from Germany in khiladi 786.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu