»   »  సుకుమార్ "కుమారి 21ఎఫ్" గురించి ఓ ఫారినర్ పాట!

సుకుమార్ "కుమారి 21ఎఫ్" గురించి ఓ ఫారినర్ పాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్'. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ ఫారినర్ పాడిన పాటను కమెడియన్ తాగుబోతు రమేష్ షేర్ చేసాడు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి మరి.

"సుకుమార్" గారి నిర్మాణంలో వస్తున్న "కుమారి21F" సినిమా గురించి...... ఒక ఫారినర్ పాట..!!

Posted by Thagubothu Ramesh Official on Thursday, October 8, 2015

ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషం. ఇదొక విభిన్నమైన ప్రేమకథ. దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. రాజ్‌తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకుంటుంది అన్నారు.

Foreigner song about Sukumar's 'Kumari 21F'

నిర్మాతలు మాట్లాడుతూ సుకుమార్ భాగస్వామ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. సుకుమార్ మార్క్‌లో సాగే ఈ ప్రేమకథాచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్ కు విశేష స్పందన లభిస్తోంది. నోయల్, నవీన్, సుదర్శన్‌రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు,ప్రొడక్షన్ డిజైనర్:ఎస్.రవీందర్,ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, పాటలు:చంద్రబోస్, మాటలు:పొట్లూరి వెంకటేశ్వరరావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, డ్యాన్స్:ప్రేమ్క్ష్రిత్, సహనిర్మాతలు:ఎం.రాజా, ఎస్.రవికుమార్.

English summary
Foreigner song about upcoming film 'Kumari 21F'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu