»   » శ్రీదేవి మృతి గుట్టు వీడింది.. రెండో శవపరీక్ష నిర్వహించలేం.. చేతులెత్తిసిన వైద్యులు!

శ్రీదేవి మృతి గుట్టు వీడింది.. రెండో శవపరీక్ష నిర్వహించలేం.. చేతులెత్తిసిన వైద్యులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
వీడిన శ్రీదేవి మృతి మిస్టరీ !

శ్రీదేవి ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిని శోక సంద్రంలో ముంచెత్తింది. అరోగ్యంగా, ఎంతో ఆహ్లాదంగా కనిపించే అందాల తార మరణించడంపై జీర్ణించు కోలేకపోతున్నారు. అంత సడెన్‌గా మరణించడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ ఫోరెన్సిక్ వైద్యుల నివేదిక చాలా కీలకంగా మారింది. తాజాగా వైద్యులు నివేదికను వెల్లడించారు.

 అనుమానాలు లేకుండా

అనుమానాలు లేకుండా

శ్రీదేవి ఓ భారతీయ సినిమాకు చెందిన ప్రముఖురాలు కావడంతో ఈ కేసును దుబాయ్ ప్రభుత్వం, అక్కడి వైద్యులు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనా ఆ కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడి కావడంలో జాప్యం జరిగింది.

ఆలస్యానికి కారణం

ఆలస్యానికి కారణం

వాస్తవానికి శ్రీదేవి మృతదేహాన్ని ఆదివారం రాత్రే ముంబైకి చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఆమె పార్దీవదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ రక్త నమూనాల రిపోర్టు రాకపోవడంతో శ్రీదేవి దేహాన్ని తరలించే విషయంలో ఆలస్యమైంది.

హాస్పిటల్‌లో మరణించలేదు

హాస్పిటల్‌లో మరణించలేదు

సాధారణంగా ఏ వ్యక్తి అయినా హాస్పిటల్‌లో మరణిస్తే ఆ వ్యక్తి మరణానికి సంబంధించిన కారణం వెంటనే తెలుస్తుంది. అయితే శ్రీదేవి మృతి హాస్పిటల్‌లో కాకుండా బయట జరిగినందున పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన తర్వాతే మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగిస్తారు.

శ్రీదేవి పాస్ట్‌పోర్టు రద్దు

శ్రీదేవి పాస్ట్‌పోర్టు రద్దు

పోలీసుల దర్యాప్తు, వైద్యుల శవపరీక్ష జరుగుతుండగానే ఎంబసీలో వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. అన్ని నిర్ధారించుకొన్న తర్వాత మృతురాలి పాస్‌పోర్టును దుబాయ్‌లోని భారతీయ ఎంబసీలో రద్దు చేస్తారు. ఆ తర్వాత పార్దీవ దేహాన్ని తరలించేందుకు డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

 గుండెపోటుతోనే మరణం

గుండెపోటుతోనే మరణం

తాజాగా శ్రీదేవి మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష నివేదిక ఆధారంగా అందాల తార గుండెపోటుతో చనిపోయినట్టు నిర్ధారించారు. రక్త నమూనాలు, శవపరీక్ష నివేదికలు అందడంలో జాప్యం జరిగినందునే ఈ ప్రాసెస్ ఆలస్యమైంది అని వైద్యులు తెలిపారు.

రెండోసారి శవపరీక్ష

రెండోసారి శవపరీక్ష

శ్రీదేవి ఓ ప్రముఖ సినీ నటి కావడంతో దర్యాప్తును చాలా పకడ్బందీగా చేశామని పోలీసులు, అధికారులు వెల్లడించారు. శ్రీదేవికి రెండోసారి శవపరీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించేది లేదు అని అధికారులు స్పష్టం చేశారు.

 రాత్రి ఏడుగంటలకు ముంబైకి

రాత్రి ఏడుగంటలకు ముంబైకి

తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి పార్దీవదేహాన్ని భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ముంబైకి తరలిస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకొంటుంది.

 అంత్యక్రియలకు ఏర్పాట్లు

అంత్యక్రియలకు ఏర్పాట్లు

కాగా, శ్రీదేవి అంత్యక్రియలను ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్మాశన వాటికలో శుద్ధి కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

 భారీ సంఖ్యలో

భారీ సంఖ్యలో

ఇప్పటికే శ్రీదేవి, అనిల్ కపూర్ నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకొన్నారు. అభిమానులు విషాదవదనంతో శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచి చూస్తున్నారు.

English summary
Forensic doctors in Dubai concluded that Sridevi died of a heart attack and added there is nothing suspicious about the way the superstar passed away , official sources in Dubai said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu