twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం మత్తులో శ్రీదేవి మృతి.. ఎవరైనా తోశారా? మరింత లోతుగా దర్యాప్తు.. పోస్‌పోర్ట్ రద్దు

    By Rajababu
    |

    అందాల తార శ్రీదేవి మృతికి సంబంధించి వెలుగు చూస్తున్న విషయాలు చర్చనీయాంశంగానూ మారుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫోరెన్సిక్ నివేదికలో బయటకు వచ్చిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. శనివారం రాత్రి శ్రీదేవి ప్రమాదవశాత్తూ జరిగిందని వైద్యులు తేల్చారు.

    Recommended Video

    వీడిన శ్రీదేవి మృతి మిస్టరీ !
    శరీరంలో మద్యం ఆనవాళ్లు

    శరీరంలో మద్యం ఆనవాళ్లు

    శ్రీదేవి హోటల్ రూమ్‌లోని బాట్ టబ్‌లో మునిగి మరణించింది అని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయి అని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.

    మరింత లోతుగా దర్యాప్తు

    మరింత లోతుగా దర్యాప్తు

    ప్రమాదానికి ముందు ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయనే అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రమాదకర పరిస్థితుల్లో మరణించడానికి దారి తీసిన కారణాలు ఏమిటని పరిశోధిస్తున్నాం అని అధికారులు వెల్లడించారు.

     దేనిని వదిలే సమస్యే లేదు

    దేనిని వదిలే సమస్యే లేదు

    శ్రీదేవి మరణానికి సంబంధించి అవకాశం ఉన్న ప్రతీకోణాన్ని వదిలడం లేదు. ఆ ఘటనకు ముందు ఉన్న ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నారు. అంతకు ముందు జరిగిన ఈవెంట్ల క్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

     శ్రీదేవి మృతదేహం తరలింపు

    శ్రీదేవి మృతదేహం తరలింపు

    ఫోరెన్సిక్ నివేదిక కుటుంబ సభ్యులకు, దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులకు అందించారు.
    దీంతో శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తరలించేందుకు మార్గం సుగమైంది.

    ఎంబసీలో పాస్‌పోర్ట్ రద్దు

    ఎంబసీలో పాస్‌పోర్ట్ రద్దు

    శ్రీదేవి మృతికి సంబంధించిన నివేదికను అందుకొన్న రాయబార కార్యాలయ అధికారులు తదుపరి కార్యాచరణలో మునిగిపోయారు. అన్ని అంశాలను నిర్ధారించుకొన్న తర్వాత మృతురాలి పాస్‌పోర్టును దుబాయ్‌లోని భారతీయ ఎంబసీలో రద్దు చేస్తారు. ఆ తర్వాత పార్దీవ దేహాన్ని తరలించేందుకు డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

     శవపరీక్ష మరోమారు చేయం

    శవపరీక్ష మరోమారు చేయం

    శ్రీదేవి ఓ ప్రముఖ సినీ నటి కావడంతో దర్యాప్తును చాలా పకడ్బందీగా చేశామని పోలీసులు, అధికారులు వెల్లడించారు. శ్రీదేవికి రెండోసారి శవపరీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించేది లేదు అని అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

     శ్రీదేవి మృతదేహం రాత్రికి

    శ్రీదేవి మృతదేహం రాత్రికి

    వాస్తవానికి శ్రీదేవి మృతదేహాన్ని ఆదివారం రాత్రే ముంబైకి చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఆమె పార్దీవదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ రక్త నమూనాల రిపోర్టు రాకపోవడంతో శ్రీదేవి దేహాన్ని తరలించే విషయంలో ఆలస్యమైంది.

    మంగళవారం అంత్యక్రియలు?

    మంగళవారం అంత్యక్రియలు?

    ఫోరెన్సిక్ నివేదిక, ఇతర వైద్య పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడంతో శ్రీదేవి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించే అవకాశం కనపడుతున్నది. శ్రీదేవి పార్దీవదేహాన్ని భారతీయ కాలమానం ప్రకారం ఒకవేళ ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లయితే దాదాపు 9 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది.

     శ్రీదేవిని ఎవరైనా తోసేశారా

    శ్రీదేవిని ఎవరైనా తోసేశారా

    శ్రీదేవి మద్యంమత్తులో బాత్‌టబ్‌లో పడిపోయారా లేక ఎవరైనా తోసేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి బోనికపూర్ అయ్యప్పన్ పేరిట ఫొరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు.

     అబద్దం ఎందుకు ఆడారు

    అబద్దం ఎందుకు ఆడారు

    ఇప్పటివరకు గుండెపోటుతో చనిపోయిందని చెప్పుకొంటూ వస్తున్న కుటుంబ సభ్యుల కథనంలో డొల్ల ఉందని స్పష్టమైంది. కుటుంబ సభ్యులు ఎందుకు అబద్దం ఎందుకు ఆడాల్సి వచ్చిందనే విషయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

    సహజ మరణం కాకపోతే

    సహజ మరణం కాకపోతే

    ఒకవేళ అనుమానాస్పద పరిస్థితుల్లో శ్రీదేవి మరణించినట్లయితే దర్యాప్తు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. శ్రీదేవిది సహజ మరణం కాకపోతే దానికి వెనుక మిస్టరీ ఏలా వీడుతుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

    English summary
    The sudden death of iconic actor Sridevi on 24 February came as a shock to her fans around the globe. According to Gulf News, the late actor’s forensic report states she accidentally drowned in her bathtub, leading to her untimely demise. The Dubai daily also said the report specified that traces of alcohol were found in the actor’s body. The body has now reportedly been released for embalming.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X