»   » షాపులో బాలీవుడ్ నటి వీరంగం, సిబ్బందిపై దాడి (వీడియో)

షాపులో బాలీవుడ్ నటి వీరంగం, సిబ్బందిపై దాడి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ ‘బిగ్ బాస్' కంటెస్టెంట్, వివాదాస్పద మోడల్ పూజ మిశ్రా మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఢిల్లీలోని కోరల్ భాగ్ ఏరియాలో ఓ స్టోర్ లో పూజా మిశ్రా వీరంగం సృష్టించింది. స్టోర్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బూడుతు తిడుతూ రెచ్చిపోయింది. గతంలోనూ ఓ హోటల్ లో సిబ్బందితో పూజా మిశ్రా గొడవ పడిన సంగతి తెలిసిందే.

2002లో ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన పూజా మిశ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కెరీర్ తొలినాళ్లలో పూజా మిశ్రా మోడలింగ్ రంగంలో రాణించింది. అందచందాలతో ఆకట్టుకుంది. మోడలింగ్ చేసేప్పుడు వీడియోకాన్, ఫ్రూటి, రాయల్ పామ్స్, ఇండియ్ ఎక్స్ ప్రెస్, సన్ సూయ్, లిస్సమ్ మాయిశ్చరైజర్ తరుపున ప్రచారం చేసింది.

Former 'Bigg Boss' Contestant Pooja Misrra Assaulting The Staff Of A Store In Delhi

2003లో వచ్చిన దిల్ కా రిస్తా సినిమాలో ఐటం గర్ల్‌గా పూజా మిశ్రా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘బాజా బజాదూంగా', ‘లవ్ ది వే ఐ యామ్' చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

English summary
Watch Former Bigg Boss Contestant Pooja Misrra Assaulting The Staff Of A Store In Karol Bagh, Delhi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu