»   » ఈ రోజు రిలీజులు..వాటి స్టోరీ లైన్ లు

ఈ రోజు రిలీజులు..వాటి స్టోరీ లైన్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ శుక్రవారం(మే 7, 2010) లారెన్స్ హీరోగా రూపొందిన సూపర్ కౌబాయ్, రాజీవ్ కనకాల హీరోగా చేసిన ఒక్క క్షణం, కమలాకర్ హీరోగా చేసిన హాసిని, రమ్యకృష్ణ ప్రధానపాత్రలో చేసిన కారా మజాకా? చిత్రాలు రిలీజవుతున్నాయి. ఇందులో సూపర్ కౌబాయ్ చిత్రం దాదాపు ఇరవై కోట్ల వ్యయంతో, సరికొత్త బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ చిత్రం నిర్మించారు. 18వ శతాబ్దానికి సంబంధించిన కథను తీసుకుని వినోదభరితంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడని చెప్తున్నారు..ఇంతవరకూ వచ్చిన కౌబాయ్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక 70 ప్రింట్లతో, 100కి పైగా థియేటర్లతో భారీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అలాగే కొడాలి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో రాజీవ్ కనకాల హీరోగా చేసిన ఒక్క క్షణం చిత్రం ఓ సస్పెన్స్ ధ్రిల్లర్ అంటున్నారు. కథ ప్రకారం అరుణ అనే కాలేజీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ హత్యకు ఒడిగట్టింది కిషోర్‌ అనే యువకుడిగా అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. నిజంగా కిషోరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో అన్వేషణ మొదలవుతుంది. ఆ తరవాత జరిగే ఉత్కంట భరితమైన సంఘటనలే ఈ చిత్రం అంటున్నారు. ఇక ఏదైనా ఓ నిర్ణయాన్ని అంతిమంగా తీసుకొనే ముందు ఒక్క క్షణం ఆలోచించాలనే ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్.

ఆ తర్వాత కమలాకర్, ప్రేమిస్తే సంధ్య జంటగా బి.వి.రమణారెడ్డి రూపొందించిన హాసిని రిలీజవుతోంది. కథ ప్రకారం..హాసిని (సంధ్య) తన విలువైన వస్తువుని పోగొట్టుకొంటుంది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లి అనుకోకుండా ఓ కుటుంబంలో చిక్కుకుపోతుంది. అక్కడి వారి ఆప్యాయతలకు మైమరిచిపోతుంది. అసలు ఆమె ఎవరు? పోగొట్టుకున్నదేమిటి? అనేది సస్పెన్స్‌ అంటున్నారు. అలాగే వినోద ప్రధానంగా సాగుతుందీ చిత్రం. స్క్రీన్‌ప్లే, కథ హైలైట్‌ అవుతాయి. పాత్రలన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయని, కోటి సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని భావిస్తున్నారు.

వీటితో పాటు శ్రావణ 'నాగమ్మ', 'నాగబాల', 'గౌరమ్మ', శుక్రవారం వంటి హిట్టయిన అనేక భక్తి చిత్రాలు రూపొందించిన రామనారాయణ తాజాగా కారా మజాకా? చిత్రాన్ని తీసారు. ఈ చిత్రం కథ..సంగీత, రాజీవ్‌ కనకాల దంపతుల బిడ్డ గీతిక. వాళ్ళకో కారు కూడా ఉంటుంది. ఉన్నట్టుండి గీతిక ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. ఇక కారు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటుంది. ఆ చేష్టలకీ-అలీ, కల్యాణిలకున్న సంబంధమేమిటన్న దిశలో కథ నడుస్తుంది. విజువల్‌ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌ కూడా ఈ కథలో ప్రధాన పాత్రని పోషిస్తాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu