twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏది హిట్ ...ఏది ఫట్ ?

    By Staff
    |

    Asta Chemma
    ఈ రోజు రిలీజవుతున్న సినిమాల్లో చెప్పుకోతగినవి...అష్టాచమ్మా,సరోజ,అంకిత పల్లవీ అండ్ ఫ్రెండ్స్. వాటి సినాప్సిస్ లు సంక్షిప్తంగా...ఈ రోజు రిలీజు అవుతున్న ఈ సినిమాలన్నీ చిన్న బడ్జెట్ లో తీసినవే కావటం విశేషం. ఇక ఈ సినిమాల్లో ఏవి హిట్..ఏవి ఫట్ అనేది సాయింత్రం లోగా తేలనుంది.

    చిత్రం :అష్టాచమ్మా

    సినాప్సిస్: లావణ్య (స్వాతి) చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. మహేష్‌ (నాని) కూడా అలాంటి బాపతే. సినీ హీరో మహేష్‌బాబును పెళ్లి చేసుకోవాలనుకున్న లావణ్య అతనికి పెళ్త్లెపోయిందని తెలిసి పక్కింటి మహేష్‌ను ప్రేమించడం ప్రారంభిస్తుంది. అతని కోసం ఊరు నుంచి వస్తుంది వరలక్ష్మి (భార్గవి). వీరందరి మధ్యలోకి ఆనంద్‌ (శ్రీనివాస్‌) వస్తాడు. అసలు కథంతా ఇక్కడి నుంచి మొదలవుతుంది.

    స్పెషాలిటీస్: ''తెలుగుదనం ఉట్టిపడే ప్రేమ కథ ఇది. చాలా సరదా సరదాగా సాగిపోతుంది. కల్యాణిమాలిక్‌ బాణీలు, సిరివెన్నెల సాహిత్యం మా చిత్రానికి బలాన్నిచ్చాయ''ని దర్శకుడు తెలిపారు.

    నిర్మాణ సంస్థ: ఆర్ట్‌బీట్‌ కేపిటల్‌,తారాగణం: స్వాతి, నాని, భార్గవి, శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, హేమ తదితరులు సమర్పణ: డి.సురేష్‌బాబు నిర్మాత: రామ్మోహన్‌, దర్శకత్వం: మోహన్‌కృష్ణ ఇంద్రగంటి

    చిత్రం :సరోజ

    సినాప్సిస్: సరోజ (వేగ) పేరున్న వ్యాపార వేత్త (ప్రకాష్‌రాజ్‌) కుమార్తె. ఆమెను కొంతమంది కిడ్నాప్‌ చేస్తారు. దాంతో పోలీస్‌ అధికారి విశ్వనాథ్‌ (శ్రీహరి) బరిలోకి దిగుతారు. క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన నలుగురు కుర్రాళ్లు అనుకోకుండా సరోజను బందీగా ఉంచిన భవంతిలోకి వెళ్తారు. అక్కడి నుంచి కథ ఏ మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరం.

    స్పెషాలిటీస్: ''సినిమా ఆద్యంతం ఊహించని మలుపులుంటాయి. ఒక రోజులో జరిగే కథ ఇది. శ్రీహరి పాత్ర ప్రేక్షకుల్ని విస్మయపరుస్తుంద''ని దర్శకుడు తెలిపారు.

    నిర్మాణ సంస్థ: అమ్మా క్రియేషన్స్‌, నటీనటులు: శ్రీహరి, వైభవ్‌, ఎస్పీ చరణ్‌, కాజల్‌, నిఖిత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సంపత్‌, వేగ, ప్రేమ్‌జీ తదితరులు, నిర్మాత: టి.శివ,దర్శకత్వం: వెంకట్‌ ప్రభు

    చిత్రం :అంకిత్‌, పల్లవి అండ్‌ ఫ్రెండ్స్‌

    సినాప్సిస్: అప్పుడే కాలేజీ పూర్తి చేసుకున్న నలుగురు యువకులు. వాళ్ల మధ్యలో ఓ అమ్మాయి. పేరు పల్లవి (మేఘ). ఆమె అంటే యువకుల్లో ఒకడైన అంకిత్‌ (నిఖిల్‌)కు ఇష్టం. చదువుల తల్లి ఒడి నుంచి అప్పుడే బయటికొచ్చిన వీరి గమ్యం ఏమిటి? పయనం ఎటు వైపు అన్నది అసలు కథ.

    విశేషాలు: దర్శకుడు హరి చిత్ర విశేషాలను చెబుతూ ''నేటి యువత మనోభావాలకు అద్దం పట్టే సినిమా ఇది. స్నేహం, జీవితం.. అనే కథా వస్తువులతో కథను అల్లుకున్నాం. మన నిత్యం చూసే పాత్రలు, సన్నివేశాల్నే తెర మీద చూడబోతున్నార''న్నారు.

    నిర్మాణ సంస్థ: ఇన్నొవిజన్‌ సంస్థ,నటీనటులు: నిఖిల్‌, మేఘాబర్మన్‌, సూర్య, ప్రదీప్‌, వేణు, నరేష్‌, సీత తదితరులు.నిర్మాత: కిశోర్‌ గంజి, రఘు, దర్శకత్వం: హరి ఎల్లేటి

    చిత్రం: తమాషా చూద్దాం రండి

    సినాప్సిస్: ''సుహాసిని కాలేజీలో చదువుతుంటుంది. వేణుకి ఆమె అంటే పంచప్రాణాలు. తనని ప్రేమించమని రోజూ వేధిస్తాడు. కానీ ఆమె ఒప్పుకోదు. తన స్నేహితుల సాయంతో ఆ భామ మనసును వేణు ఎలా గెలుచుకున్నాడు అనేది ప్రధాన కథాంశమ''ని అన్నారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన పూర్ణచంద్రరావు.

    విశేషాలు: ''హాస్యరస ప్రధానమైన చిత్రమిది. చందు నృత్యాలు ఆకట్టుకుంటాయ''న్నారు నిర్మాతలు.

    నిర్మాణ సంస్థ: సత్యపూర్ణ పిక్చర్స్‌, నటీనటులు: వేణు, సుహాసిని, చందు, ఎమ్మెస్‌ నారాయణ, కొండవలస, గౌతంరాజు, ప్రసాద్‌బాబు, నర్సింహరాజు, కవిత, కృష్ణవేణి, బెంగుళూరు పద్మ, అల్లరి సుభాషిణి, పత్యూష. నిర్మాత: వి.బి.పూర్ణచంద్రరావు, సత్యనారాయణ
    దర్శకత్వం: బి.అశోక్‌రావు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X