»   » అక్కడ మూత్రం పోస్తే కబాలీ టికెట్ ఫ్రీ..! ఫ్రీ...!! ఫ్రీ...!!

అక్కడ మూత్రం పోస్తే కబాలీ టికెట్ ఫ్రీ..! ఫ్రీ...!! ఫ్రీ...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి కలెక్టర్.. అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛభారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికి 'కబాలి' టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తెలిపారు. అలాగే పుదుచ్చేరి అభివృద్ధి కోసం రజనీ ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని బేడీ విజ్ఞప్తి చేశారు.

ఓవైపు ఎయిర్‌ ఏషియా సంస్థ రజినీకాంత్‌ క్రేజ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటూ.. కబాలి రిలీజ్‌ రోజు బెంగళూరు నుంచి చెన్నైకి తీసుకెళ్లి సినిమా చూపించి తీసుకొచ్చే ఆఫర్‌ ఒకటి ప్రవేశ పెట్టింది. అంతే కాక తమ విమానాల మీద కబాలి పోస్టర్లతో ఈ సినిమాను సరికొత్తగా ప్రమోట్‌ చేస్తోంది.

కొన్ని మార్గాల్లో టికెట్‌ రేట్లను కూడా తగ్గించింది. కబాలి' రిలీజయ్యే సమయానికి ఇంకా చాలా విచిత్రాలే చోటు చేసుకునేలా ఉన్నాయి. తాజాగా పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేడీ.. 'కబాలి' క్రేజ్‌ను ఓ మంచి పని కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారు. పుదుచ్చేరిలో బహిరంగ మూత్ర మల విసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె ఓ చిత్రమైన ఆఫర్‌ ప్రకటించారు.

Free 'Kabali' Ticket for using Public Services

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్లను వినియోగించే వారికి కూడా కబాలి టికెట్లు ఉచితంగా అందజేస్తామని కిరణ్‌ బేడీ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ పోసుకున్న వాళ్ళందరికీ కాదు. దానికీ కొన్ని నిబందనలున్నాయి. స్వచ్ఛభారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికే ఈ అవకాసం మరి. జనాలు పబ్లిక్‌ టాయిలెట్లు వినియోగించేలా చైతన్యం తీసుకురావడం కోసమే ఈ ఆలోచన అని కిరణ్‌ బేడీ ప్రకటించారు.

పర్యాతక ప్రదేశమైన పుదుచ్చేరీ చక్కని ప్రాంతమనీ.., ఇలాంటి ప్రదేశాన్ని పరిశుబ్రంగా ఉంచతం అవసరమనీ.., ఇలాంటి చోట్ల బహిరంగా మలమూత్ర విసర్జన ఎంతమాత్రం సమంజసం కాదని.. ఆమె అంటున్నారు. పుదుచ్చేరికి రజినీకాంత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే చాలా బాగుంటుందని కూడా ఆమె అంటున్నారు.మరి కబాలి టికెట్ల కోసమైనా జనాలు పబ్లిక్‌ టాయిలెట్లనే వినియోగిస్తారేమో చూడాలి.

English summary
Kiran Bedi IPS, the new Lieutenant Governor of Pondicherry has announced in her microblogging page that a Collector in Pondicherry is using free tickets for 'Kabali' as an incentive to people who use public services.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X