»   » ఇక శనివారం సినీ వారమే... ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లకి రవీంద్ర భారతి ఉచిత వేదిక

ఇక శనివారం సినీ వారమే... ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లకి రవీంద్ర భారతి ఉచిత వేదిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న "సినివారం". ఈ శీర్షికతో షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ ఉచితంగా ప్రదర్శన చేస్తున్నారు.ఈ రోజు సినివారంలో... రెండు షార్ట్ ఫిల్మ్ లను ప్రదర్శించనున్నారు.శివ దర్శకత్వంలో రూపొందించిన "రౌండ్ ద క్లాక్)" షార్ట్ ఫిల్మ్. ఈ యువ దర్శకుడు తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

చంద్ర పాల్ దర్శకత్వంలో రూపొందించిన "మార్గదర్శి" షార్ట్ ఫిల్మ్. మార్గదర్శి లఘు సినిమాలో ఈవ్ టీజింగ్ కి సంబందించి తీసినది. ఈ సినిమా దర్శకులే రచయిత కూడా. ఇందులో దర్శకులైన చంద్ర పాల్ ఒక పాత్రలో నటించారు. ఈ సినిమాకి సి.హెచ్. నరసింహ గారు నిర్మాతగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ సినిమాల దర్శక నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు,సాంస్కృతిక శాఖ సంచాలకులు ఇతర అతిథులు, సినీ ప్రేమికులు, ఫిల్మ్ మేకర్స్ పలువురు పాల్గొననున్నారు.

free short film screening at ravindra bharathi

కార్యక్రమంలో నగలూరి నరేందర్ గౌడ్, అక్షర కుమార్, సంఘీర్ ఫిల్మ్ మేకర్స్ , తది తరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఆసక్తి వున్నవారు హాయిగా అక్కడ ప్రదర్శించబడే సినిమాలని చూడవచ్చు, అక్కడికి వచ్చే సినీ ప్రముకుల సలహాలనూ పొందవచ్చు. సినిమా మీద ఇష్టం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వేదిక ఉపయోగకరంగా ఉండనుంది.

free short film screening at ravindra bharathi

తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రతీ శనివారం "సినివారం". ఈ శీర్షికతో...గత నెల 12 నుండి ఉచితంగా "లఘుచిత్రం/డాక్యుమెంటరీ/ఫీచర్ ఫిల్మ్స్" ప్రదర్శన చేస్తున్నారు. ఇక నుంచి ఔత్సాహిక యువ దర్శకులకు ఉచిత వేదిక రవీంద్రభారతి అని, కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలికే "సినివారం" అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నవతరం సినిమా ఎదుగుదలని ప్రోత్సహిద్దాం, సాంస్కృతిక శాఖ వారిని అభ్యర్థిస్తూ ఒక ఉత్తరాన్ని రాయండి. లేదా cinivaram.rb@gmail.com కి మెయిల్ చేయండి లేదా-(+91-9849391432/040-23212832).సంప్రదించగలరు అని సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

English summary
Every saturday a short film screening at ravindra bharathi mini hall.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu