»   » 'స్లమ్‌ డాగ్ మిలియనీర్' ఫ్రీదా పింటో ఏం చేస్తోంది?

'స్లమ్‌ డాగ్ మిలియనీర్' ఫ్రీదా పింటో ఏం చేస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ పొందిన 'స్లమ్‌ డాగ్ మిలియనీర్' చిత్రంలో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అందం ఫ్రీదా పింటో. ఆ తర్వాత ఆమె ఏ ఇండియన్ సినిమాను ఒప్పుకోకపోవటంతో ఆమె వార్తలు పెద్దగా రాలేదు. అయితే ఆమె తాజాగా 'మిరాళ్', 'యు విల్ మీట్ ఎ టాల్ డార్క్ స్ట్రేంజర్' అనే రెండు హాలీవుడ్ చిత్రాల షూటింగుని పూర్తిచేసింది. 'మిరాళ్' చిత్రం..1950ల కాలంలో జెరూసలేంలోని ఒక అనాథాశ్రమంలో జరిగిన సంఘటనల చుట్టూ తిరిగుతుంది. అక్కడ పెరిగిన మిరాళ్ అనే అమ్మాయిగా ఈ సినిమాలో ఫ్రీదా కనిపించబోతోంది. 'బిఫోర్ నైట్‌ఫాల్స్' సినిమాకి గాను ఆస్కార్ నామినేషన్ పొందిన డైరెక్టర్ జూలియన్ ష్నాబెల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో విల్లమ్ డాఫో, అలెగ్జాండర్ సిద్దిగ్, హియామ్ అబ్బాస్ వంటి హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇందునిమిత్తం ఇజ్రాయెల్‌లో నాలుగు నెలలపాటు గడిపింది. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. ఈ ఏడాది సగంలో ఈ సినిమా విడుదల కానున్నది. అలాగే ఈ సినిమాతో పాటు ప్రఖ్యాత దర్శకుడు వుడీ అలెన్ రూపొందిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'యు విల్ మీట్ ఎ టాల్ డార్క్ స్ట్రేంజర్' అనే సినిమాని కూడా పూర్తిచేసింది ఫ్రీదా. అది కూడా త్వరలో రిలీజయ్యే అవకాసం ఉంది. ఈ రెండింటిలో ఒక్కటి వర్కవుట్ అయినా ప్రిదా హాలీవుడ్ లో సెటిల్ అయిపోయినట్లే అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu