»   » ఫ్రెండ్స్ ఫండింగ్ సినిమా హృదయాంజలి "వ్లోగో" ఆవిష్కరణ

ఫ్రెండ్స్ ఫండింగ్ సినిమా హృదయాంజలి "వ్లోగో" ఆవిష్కరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

యెన్నెన్జీ మోషన్ పిక్చర్స్ (Yennengee Motion Pictures) పతాకంపై ఫ్రెండ్స్ ఫండింగ్ ఫీచర్ ఫిలిం నిర్మిస్తున్న హృదయాంజలి లోగోను తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.నగులూరి నరేందర్‌గౌడ్‌ (యెన్నెన్జీ) దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వీడియో లోగోను (వీడియో+లోగో=వ్లోగో అంటున్నారు) ఆవిష్కరించాక. హాజరైన ప్రముఖులు సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేసారు.

freinds funding feature film vlogo release

'యాది', 'ఉత్తచేతుల బిక్షపతి', 'రాజిగ ఓరి రాజిగ' వంటి లఘు చిత్రాలు, 'ఆర్ట్‌ ఎట్‌ హార్ట్‌'తో పాటు పేరిణిపై డాక్యుమెంటరీలు తీసిన తనకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా అనీ, రోడ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తియ్యబోతున్నాననీ యెన్నెన్జీ చెప్పారు. స్నేహితులు సమకూర్చే నిధులతో ఈ చిత్రాన్ని తీస్తామనీ చెప్పటం గమనార్హం, ఒక్క సినిమా కల నెరవేరటానికి అదే కలని కనే మరికొంత మందిని కలుపుకొని సినిమా తీయటానికి సిద్దమైపోయినట్టు. ఈ నెల 11 ఉంచీ నిధుల సమీకరణ మొదలు పెట్త బోతున్నట్టూ చెప్పారు.

ఫిల్మ్ తెలంగాణ పేరుతో నిర్వహించిన తెలంగాణ సినిమా పండుగలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న ఎన్నెన్జీ నేడు ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా వెండి తెరకు పరిచయం కానుండటం సంతోషంగా ఉందన్న మామిడి హరికృష్ణ. యాది, ఉత్తచేతుల బిక్షపతి, రాజిగ ఓరి రాజిగ వంటి లఘుచిత్రాల నిర్మా ణంతో తెలంగాణ యువతలో ప్రతిభకు లోట్తులేదని నిరూపించిన ఈ యువ బృందం వెండితెరపైనా తామేమిటో నిరూపించుకుంటుందని అన్నారు.

తెలంగాణ కళాకారులు తెగువతో ముందుకొస్తున్నారని, అన్ని రంగాల్లో తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, కానీ సిని మా రంగంలో ఆ విధమైన వేగం, వ్యూహం లేదని ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రాంత సినిమాని ఒక మెట్టుపైకి తీసుకొచ్చేందుకు ఈ తరం యువకులు చేస్తున్న కృషిని చూస్తూంటే సంతోషంగా ఉందని, దర్శకుడు ఎన్నెన్జీకి, ఇటువంటి తెలంగాణ యువ ప్రతిభావంతులకు తన సహకారం, తోడ్పాటు ఉంటుందని సీవీఎల్ హామీ ఇచ్చారు.

నా వంతుగా ఈ సినిమాలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, తెలంగాణ సినిమాకు నేను సైతం ముందుంటానని చెప్పటం అక్కడున్న వారిలో మరింత ఆనందాన్ని కలిగించింది. హృదయాంజలి దర్శకుడు ఎన్నెన్జీ మాట్లాడుతూ ఫేస్‌బుక్ సహకారంతో స్నేహితులు, పరిచయస్తులను ఆర్థిక సహకారం కోరి ఈ సినిమా తీస్తున్నామని, ఆర్థికంగానే కాకుండా హార్థికంగానూ సహకరి స్తామని సినిమా అభిమానులు కళాకారులు ముందుకువచ్చారన్నారు.

అయితే ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అంటే కేవలం డబ్బులు ఇవ్వటమే కాదు. సాంకేతిక నిపుణుల, నటుల సహకారం కూడా సహాయం లో భాగమేనన్న ఎన్నెన్జీ ప్రతిభ ఉన్న నటులను కూడా తీసుకుంటున్నామనీ తెలిపారు. రోడ్ జర్నీ నే మైన్ పాయింట్ గా ఈ సినిమా నిర్మించబడుతోంది బెంగుళూరునుంచి ఒకరూ, హైదరాబాద్ నుంచి ఒకరూ బయలు దేరి కన్యాకుమారి కి చేరుకోవటానికిచేసే జర్నీ ప్రధానం గా కథని అల్లుకోవటం తో ఈ సినిమాని తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా మూడు భాషల్లోనూ తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు ఎన్నెన్జీ .

English summary
Freinds Funding Feature Film Hrdayanjali Logo Realeased by Telangana language and cultural department director Mamidi Harikrishna
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu