»   »  వివాదంలో దంగల్ నటి.. ఇండియాను ఓడించు.. పాక్‌కు మద్దతుగా..

వివాదంలో దంగల్ నటి.. ఇండియాను ఓడించు.. పాక్‌కు మద్దతుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దంగల్‌లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన జైరా వసీం మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేస్‌బుక్‌లో ఆమె తల్లి జైర్కా వసీం చేసిన నిర్వాకానికి ఆమె సమస్యల్లో చిక్కుకున్నారు.

 ఇండియాను ఓడించండి.. దంగల్ నటి తల్లి

ఇండియాను ఓడించండి.. దంగల్ నటి తల్లి

‘సహనం వహించండి. ఇండియాను ఓడించండి' అని జైరా వసీం తల్లి జైర్కా వసీం ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో నిరసన వ్యక్తమైంది. ఆమె తల్లి చేసిన నిర్వాకం మూలంగా ఆమె తాజా వివాదంలో కూరుకుపోయారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

 2014 నుంచి భారత్‌కు వ్యతిరేకంగా..

2014 నుంచి భారత్‌కు వ్యతిరేకంగా..


2014 నుంచి జైర్కా వసీం పాకిస్థాన్ అనుకూలంగా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్టు ఓ నెటిజన్ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఓ నెటిజన్ స్క్రీన్ షాట్స్ తీసి తన అకౌంట్‌లో షేర్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

 ఢాకాలో టీ20 పోటీల సందర్భంగా..

ఢాకాలో టీ20 పోటీల సందర్భంగా..


ఇటీవల ఢాకాలో జరిగిన వరల్డ్ టీ20 ఛాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా ఈ పోస్ట్ చేసినట్టు గుర్తించారు. ఈ టోర్నిలో భారత, పాకిస్థాన్ జట్లు తలపడగా జైర్కా వసీం పాక్‌కు మద్దతుగా పలు పోస్టులు చేశారు.

 నెటిజన్ల దాడి.. కంగుతిన్న జైరా వసీం

నెటిజన్ల దాడి.. కంగుతిన్న జైరా వసీం


జైర్కా వసీం చేసిన నిర్వాకంపై నెటిజన్ల దాడి మొదలవ్వడంతో దంగల్ బాలిక జైరా వసీం కంగుతిన్నారు. ఆమెను దేశద్రోహి అంటూ పలువురు ట్విట్టర్‌లో దాడి చేశారు. ఈ దేశంలో ఉండే అర్హత నీకు లేదు. వెళ్లిపో అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Fresh trouble for 'Dangal' girl Zaira Wasim. Her mother tweeted contravarsial post. She encouraged the Pakistan while cricket match Against India. Screenshots of the posts went viral on social media platforms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu