»   » దేముడా...మేకప్ లేకుండా హీరోయిన్స్ ఇలా ఉంటారా? (షాకిచ్చే ఫొటోలు-2)

దేముడా...మేకప్ లేకుండా హీరోయిన్స్ ఇలా ఉంటారా? (షాకిచ్చే ఫొటోలు-2)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఆ గ్లామర్ కు గ్రామర్ ఏమిటి అంటే మేకప్. అందుకునే ప్రతీ హీరోయిన్, హీరో కూడా పర్శనల్ మేకప్ మెన్ ని మెయింటైన్ చేస్తూంటారు. చివరకి పబ్లిక్ పంక్షన్స్ కు వచ్చినా కూడా వారు మేకప్ లేకుండా బయిటకు రావటానికి ఇష్టపడరు. అందుకే సాధ్యమైనంతమంది స్టార్ హీరోయిన్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారో మీకు చూపెట్టాలని ఫిక్సైపోయాం. ఇదిగో ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి మరి

  ఎందుకంటే గ్లామర్ అనేది సినిమా ప్రపంచంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. నిజజీవితంలో కనిపించే అందం వేరైతే, స్క్రీన్ మీద కనిపించే అందం మరోలా ఉంటుంది. అందుకు సెలెబ్రెటీలే ఉదాహరణ. స్క్రీన్ మీద మరింత అందంగా యంగ్ గా మరియు స్టైలిష్ గా మరియు ఫ్యాషలనబుల్ గా కనబడుటకు వివిధ రకాలుగా కష్టపడుతుంటారు.

  Also See : మేకప్ లేకుండా మన హీరోయిన్స్ ఇంత ఇలా ఉంటారా?...షాకిచ్చే ఫొటోలు 1

  ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీలైనా మేకప్ ఉంటే ఒకలాగా మేకప్ లేకుంటో మరోలాగా కనబడుతుంటారు. అలా ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కెమెరాలకు బందీ అయిన కొంత మంది స్టార్ సెలబ్రెటీల యొక్క నిజ రూపం ఏంటనేది కొన్ని ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

  మేకప్ లేకుండా హన్సిక

  మేకప్ లేకుండా హన్సిక

  బబ్లి గాళ్ హన్సిక మనకు దేశముదురు చిత్రంతో పరిచయం. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా చేస్తూ తమిళంకు వెళ్లి అక్కడ సెటిలైపోయింది. అక్కడ ఆమె వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె మేకప్ లేనప్పుడు ఇదిగో ఇలా ఉంటుందన్నమాట.

  గోపిక ని గుర్తు పట్టారా

  గోపిక ని గుర్తు పట్టారా

  రవితేజ .నా ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్ చిత్రంతో అందరి మనస్సులను దోచుకున్న గోపిక, ఆ తర్వాత తెలుగులో పెద్దగా చెయ్యలేదు. తన మాతృభాష మళయాళంలో సినిమాలు చేసి, తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె మేకప్ లేనప్పుడు ఇలా ఉంటుంది.

   హాసిని...మేకప్పు తీసేస్తే..

  హాసిని...మేకప్పు తీసేస్తే..

  బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా అదరకొట్టిన జెనిలియాని మర్చిపోవటం కష్టమే. పెళ్లిచేసుకుని ఇద్దరి బిడ్డలకు తల్లి అయిన జెనీలియా...ఇదిగో మేకప్ లేకుండా ఇలా ఉంటుంది. రితీష్ కి ఇలాగే నచ్చి ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నాడు మరి.

  ఛార్మింగ్ గర్లే అప్పుడూ ..ఇప్పుడూ

  ఛార్మింగ్ గర్లే అప్పుడూ ..ఇప్పుడూ

  జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఛార్మి వెండితెరపై కనిపించింది లేదు. పూరి తో కలిసి ఆమె కాస్టింగ్ ఏజన్సీ పనుల్లో బిజీగా ఉంటోంది. అయితే తెలుగు సిని రంగంలో ఆమెదో ప్రత్యేకమైన ముద్ర. ఆమె మేకప్ లేకుండా కూడా మిళమిళా మెరిసిపోతోంది కదూ.

  అంతకుమించి అందం

  అంతకుమించి అందం

  పవన్ కళ్యాణ్ చిత్రం ఖుషీ గుర్తుండే ఉంటుంది కదూ. ఆ సినిమాలో భూమిక ను మర్చిపోవటం సాధ్యం కాదు. అయితే ఆమె తెరపై ఎంత అందంగా ఉంటుందో .. మేకప్ లేకుండా బయిట కనిపించినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగానే మెరుస్తుంటుంది.

   కాస్త కష్టమే సుమీ

  కాస్త కష్టమే సుమీ

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతమ్మగా అదరకొట్టిన అంజలి ఆ తర్వాత గీతాంజలి అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా అద్బుతం అనిపించింది. ఆమె మేకప్ లేకుండా ఎలా ఉంటుందో పై ఫొటోలో చూసారు కదా...

  అందం కాస్త తగ్గినట్లుంది కదూ...

  అందం కాస్త తగ్గినట్లుంది కదూ...

  రీసెంట్ గా భర్తతో విడాకుల విషయమై అన్ని భాషల మీడియాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అమలా పాల్ ...నిజ జీవితంలో ఎలా ఉంటుంది. మేకప్ లేకుండా ఆమె అంత అందంగా ఉంటుందా..అంటే ఇదిగో ఇదే సమాధానం.

  ఐశ్వర్యా విత్ నో మేకప్

  ఐశ్వర్యా విత్ నో మేకప్

  మేకప్ లేకుండా ఐశ్వర్యారాయ్ ని చాలా సార్లు ఫొటోల్లో చూసామంటారా. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మేకప్ లేకుండా అంత పెద్ద స్టార్ బయిటకు రావటం అనేది అరుదు. ఆమె మేకప్ లేకుండా ఉన్న ఫొటో ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు. అఫ్ కోర్స్ ఆమె మేకప్ లేకపోయినా కేకే అనుకోండి.

   దీపిక మేనేజ్ చేస్తోంది

  దీపిక మేనేజ్ చేస్తోంది

  ఈ రోజున బాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే దీపికా పదుకోని కళ్ళు మూసుకుని చెప్తారు ఎవరైనా. ఎందుకంటే హాలీవుడ్ లో కూడా ఆమె ప్రవేశించి స్టార్ డమ్ తెచ్చుకుని అద్బుతమైన సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఆమె మేకప్ లేకుండా ఇలా ఉంటుంది .

   కరీనా కు వెయ్యాల్సిందే మేకప్

  కరీనా కు వెయ్యాల్సిందే మేకప్

  మేకప్ లేకుండా కరీనా కపూర్ ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. కరీనా కపూర్ వీరాభిమానులకు ఈ ఫొటో కాస్త ఇబ్బంది అనిపించవచ్చేమో కానీ , ఆమె మాత్రం మేకప్ లేకపోయినా వావ్ అనిపించేలా ఉంది కదూ.

   గుర్తుపట్టలేదు కదూ...

  గుర్తుపట్టలేదు కదూ...

  ఈ పై ఫొటో చూసి ఎవరో అనుకుంటున్నారు కదూ. నిజంగానే ఆమె కత్రినా కైఫ్. మేకప్ లేకుండా పోయేసరికి కాస్త ఇదిగో ఇలా తేడా కొడుతోంది. ఆమె అందం తగ్గిందా, పెరిగిందా మేకప్ లేకుండా అనేకంటే...మేకప్ లేని కత్రినా చాలా డిఫరెంట్ గా గుర్తు పట్టలేని విధంగా మాత్రం ఉంది.

   ఎవరబ్బా ఈమె

  ఎవరబ్బా ఈమె

  ఈ ఫొటో చూస్తూంటే ఎక్కడో చూసినట్లే ఉందే కానీ ప్రియాంకచోప్రాలా లేదే అనిపిస్తోంది కదూ. అవును నిజంగా ఇది ప్రియాంక చోప్ర ఫోటోనే. ఆమె మేకప్ లేకపోతే ఇలా ఉంటుందన్నమాట. అంత తేడా మేకప్ తో ఆమె క్రియేట్ చేస్తోంది మరి. హాలీవుడ్ దాకా వెళ్లింది ప్రియాంక అంటే ఆ మాత్రం ఉండదేంటి అంటారా..మీ ఇష్టం.

  క్వీన్ కు మేకప్ పడాల్సిందే

  క్వీన్ కు మేకప్ పడాల్సిందే

  ఏంటి మన ప్రబాస్ ప్రక్కన ఏక్ నిరంజన్ లో నొక్కులు జుట్టుతో కనిపించిన కంగనా రనత్ ఈమేనా..మేం నమ్మం అంటారా..నమ్మక తప్పదు మరి. మేకప్ లేకపోతే ఇలాగే ఉంటుంది ఆమె. కానీ మేకప్ వేస్తే క్వీనే. నటనతో తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తున్న ఈ బాలీవుడ్ క్వీన్ అసలు రూపం ఇదన్నమాట.

   సొట్టబుగ్గలకు మేకప్ అవసరమా

  సొట్టబుగ్గలకు మేకప్ అవసరమా

  అబ్బ..భలే గుర్తు పట్టేసారు. సొట్ట బుగ్గని చూసి ప్రీతి జింతా అని ఫైనల్ చేసేసారు కదూ. అవును ప్రితిజింతా మేకప్ వేస్తే వేరే విధంగా ఉంటుందన్నమాట నిజమే కానీ ...మేకప్ లేకపోయినా ఈ సొట్టబుగ్గల సుందిరి అందం..అందమే.

   మార్పు కనపడుతోంది

  మార్పు కనపడుతోంది

  బాలీవుడ్ ని ఏలిన మాధురి దీక్షిత్.. మేకప్ లేకపోతే మీరు గుర్తు పట్టడం కష్టమే. ఎందుకంటే తెర మీదకు, తెర వెనకకు ఆమె అందంలో చాలా తేడా వచ్చింది కదా. అందాల మాధురిని ఇలా చూడటం మీకు కాస్త కష్టమే అనిపిస్తుంది కదూ.

   కాస్త చబ్బీగా..

  కాస్త చబ్బీగా..

  యస్ ..రీసెంట్ గా మురగదాస్ డైరక్షన్ లో అకీరా అంటూ ఫైట్స్ గట్రా చేసిన అందగత్తే ఈమె. కాకపోతే మేకప్ లేకపోతే ఇంకా బాగా చబ్బిగా కనిపిస్తోంది. మేకప్ తో చాలా బాగం కవర్ చేస్తున్నారు. కాకపోతే మేకప్ లేకపోయినా న్యాచురల్ బ్యూటీలా ఉంది కదూ.

  లేకపతేనే ముచ్చటగా

  లేకపతేనే ముచ్చటగా

  మేకప్ లేకపోతేనే యామి గౌతమి చాలా బాగుంటుందని ఆమె తో పనిచేసిన వారందరూ చెప్తూంటారు. అంతెందుకు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ అయితే మేకప్ లేని యామీ ఎంత ముచ్చటగా ఉంటుందో అంటూ మురిసిపోతూ చెప్పాడు.

   చెల్లిలాగే అక్క కూడా..

  చెల్లిలాగే అక్క కూడా..

  కరీనా కపూర్ అక్క..ఒకనాటి హీరోయిన్ కరిష్మా కపూర్. ఆమె మేకప్ లేకుండా రోడ్డు మీదకు వస్తే ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆమె వయస్సు కూడా బాగా పెరిగింది. అది కూడా మొహం లో కనపడుతోంది. అయితే మేకప్ ఆ వయస్సుని కొంతవరకూ దాచేది కదా అంటారా.అదీ నిజమే అనుకోండి.

   మెస్మరైజింగ్ అనాల్సిందే

  మెస్మరైజింగ్ అనాల్సిందే

  కొందరు మేకప్ లేకపోయినా మెస్మరైజింగ్ గా ఉంటారు. అలాంటివారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది డయానా. ఆమె అందం చూడాలంటే మేకప్ లేని ఇలాంటి ఫొటోల్లోనే చూడాలి. ఆమె మెస్మరైజింగ్ లుక్స్ అదిరిపోయాయి కదూ.

   కాస్త ఇబ్బందిగానే ఉంది కదా

  కాస్త ఇబ్బందిగానే ఉంది కదా

  ఎవరీ ముదరు అమ్మాయి అంటారా..అదేనండి ఒకప్పుడు బాలీవుడ్ లో వెలిగిన దియా మీర్జా. కాకపోతే కాస్త మేకప్ లేకపోతే ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పుడు పెద్దగా సినిమాలు ఏమీ చెయ్యటం లేదు కదా. అందుకే ఇలాగే మేకప్ తగ్గించి రోడ్డుమీదకు వచ్చేస్తోంది.

   ముందు వెళ్లి మేకప్ వేసుకురామ్మా

  ముందు వెళ్లి మేకప్ వేసుకురామ్మా

  ఇంద్ర సినిమాలో చిరంజీవి సరసన, మురారిలో మహేష్ సరసన అదరకొట్టిన సోనాలి బింద్రే గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను మేకప్ లేకుండా చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. మీరు హర్టయ్యారు కదూ. కానీ ఏం చేస్తా..మేకప్ లేకపోతే అమ్మగారు ఇదే రూపు మరి.

  English summary
  Many people believe that actresses look beautiful only with make-up. But it's not true! Many actresses, even if they are dusky look stunning without make-up. Some t-Town divas are blessed with flawless skin while some have got very attractive features. You might have seen many shocking pictures of our Bollywood actresses without make-up but today we bring to you some really gorgeous pictures of telugu film actresses to prove that they look pretty even without a tinge of make-up.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more