Just In
Don't Miss!
- News
ప్రజాస్వామ్య విజయం, అమెరికన్లందరికీ అధ్యక్షుడిని: జో బైడెన్ ప్రసంగం, ట్రంప్‌కి చురక
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Lifestyle
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్హహ్హహ్హ.... ‘అత్తారింటికి దారేది’ చూస్తే అంతే!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం చూస్తే, హ్హహ్హహ్హ...హ్హహ్హహ్హ...హ్హహ్హహ్హ అంటూ కడుపారా నవ్వుకోవచ్చు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో హాస్యభరితంగా రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ ఈ సినిమా కోసం మంచికామెడీ టైమింగ్ ఉన్న పంచ్ డైలాగులను బోలెడు రాసాడట. ఈ సినిమాలో నటిస్తున్న వారు సైతం ఆ డైలాగులు విని ఔరా అంటున్నారు. ఇటీవల హీరోయిన్ సమంత దర్శకుడు త్రివిక్రమ్ డైలాగులను ఓ రేంజిలో పొగిడేసింది. ఆయన మాటలతో మాయచేస్తారని, ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని కితాబిచ్చేసింది.
ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.