»   »  "అదే నేరమైతే.. వెంటనే లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి"

"అదే నేరమైతే.. వెంటనే లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి"

Subscribe to Filmibeat Telugu

'అందాల రాక్షసి' సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు 'ఇంటిలిజెంట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ భామకు గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు.

'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!

అయినా సరే తన అందం, అభినయంతో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది. సినిమాల సంగతెలా ఉన్నా.. తన అందాలతో అభిమానుల్ని మాత్రం ఫిదా చేస్తోంది. తాజాగా ఎల్లో కలర్ గౌనులో మెరిసిపోతున్న కొన్ని ఫోటోల్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ ఫోటోల్ని చూసి ఓ అభిమాని స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

తెలివైనవాడు ఇలా చేస్తాడా?: 'ఇంటిలిజెంట్'పై కత్తి, వినాయక్ మార్క్ మిస్ అయిందా!


 'లావణ్యను అరెస్ట్ చేయండి'

'లావణ్యను అరెస్ట్ చేయండి'

లావణ్యను ఎల్లో కలర్ గౌనులో చూసి వరుణ్ అనే ఓ నెటిజెన్ ఫిదా అయిపోయాడు. ఆ ఫోటోను లావణ్యకు ట్యాగ్ చేస్తూ 'అందంగా ఉండటం నేరమైతే.. వెంటనే లావణ్యను అరెస్ట్ చేయండి.. ఆమె తన అందంతో చంపేస్తోంది' అని ట్వీట్ చేశాడు.


 లావణ్య ఫన్నీ రిప్లై:

లావణ్య ఫన్నీ రిప్లై:

నెటిజెన్ ఫన్నీ కామెంట్ కు అంతే ఫన్నీగా లావణ్య రిప్లై ఇచ్చింది. 'మా నాన్న లాయర్..హా.. హా(నవ్వుతూ)' అంటూ సదరు నెటిజెన్ కు ట్వీట్ చేసింది. వీరిద్దరి చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 'ఇంటిలిజెంట్'తో ప్రేక్షకుల ముందుకు:

'ఇంటిలిజెంట్'తో ప్రేక్షకుల ముందుకు:

ప్రస్తుం లావణ్య త్రిపాఠి సాయిధరమ్ తేజ్ సరసన 'ఇంటిలిజెంట్' సినిమాలో నటిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.


 కృష్ణ' సినిమా లాగే: వివి వినాయక్

కృష్ణ' సినిమా లాగే: వివి వినాయక్

గతంలో నా దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'కృష్ణ' చిత్రం తరహాలో అన్ని అంశాల్ని మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాను. సాయిధరమ్‌తేజ్ అద్భుతంగా నటించాడు.


సినిమాలో కొండవీటిదొంగలోని 'చమకు చమకు..'అనే పాటను ఇందులో రీమిక్స్ చేశాం. ఈ పాటలో సాయిధరమ్‌తేజ్ వేసిన స్టెప్స్ చూసి ఆశ్చర్యపోయాను. శివ ఆకుల చక్కని కథని అందించారు. మా కాంబినేషన్‌లో హిట్ సినిమా అవుతుంది.


 సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్

ఖైదీనంబర్ 150 వంటి సినిమా తరువాత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం ఉన్నా.. వినాయక్ నాతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న వరుణ్‌తేజ్ 'తొలిప్రేమ' కూడా పెద్ద హిట్ కావాలి.


 అందరికీ నచ్చే సినిమా: సి. కల్యాణ్

అందరికీ నచ్చే సినిమా: సి. కల్యాణ్

ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా సినిమా ఎవరికి పోటీకాదు. సంక్రాంతికి బాలయ్య జైసింహాతో హిట్ కొట్టాం. ఇక ఇంటిలిజెంట్ నిర్మాతగా నేను గర్వంగా చెప్పుకునే చిత్రం. వినాయక్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.


English summary
A fan demanded to arrest heroine Lavanya Tripathi for killing them with her beauty. For his funny tweet Lavanya gave a funny reply
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu