»   » రజనీకాంత్‌ను అడ్డంపెట్టుకుని.. పబ్లిసిటీకి పరాకాష్ట అంటే ఇదేనేమో?

రజనీకాంత్‌ను అడ్డంపెట్టుకుని.. పబ్లిసిటీకి పరాకాష్ట అంటే ఇదేనేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ అన్నీ చాలా గ్లామరస్‌గా, అందంగా కనిపించే హీరోలతోనే చేస్తారు. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ ముఖ్య ఉద్దేశ్యమే నల్లగా ఉండే మీరు తెల్లగా, గ్లామరస్‌గా మారుతారని ప్రచారం చేయడం. కానీ నల్లగా ఉండే రజనీకాంత్‌తో ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? చూడ్డానికి చాలా కామెడీగా ఉంటుంది...

నల్లగా ఉండే ఇతర హీరోలతో ఇది సాధ్యం కాకపోవచ్చేమో గానీ.... రజనీకాంత్‌తో అయితే ఇది సాధ్యమే అని భావించిందో ఏమో? సదరు కంపెనీ... రజనీ కాంత్ కబాలి సినిమాకు ఉన్న క్రేజ్‌ను తన పబ్లిసిటీకి వాడుకుంది. కబాలి పోస్టర్లతో ఇమామి ఫెయిర్ అండ్ హాండ్సమ్ యాడ్స్ రిలీజ్ చేసింది.


మరి ఆ యాడ్ చూసి ఏమని అర్థం చేసుకోవాలి... ఆ క్రీమ్ రాసుకుంటే రజనీ లాంటి రంగు వస్తుందని భావించాలా? అంటూ పలువురు జోక్స్ పేలుస్తున్నారు. పబ్లిసిటీకి పరాకాష్ట ఇంతకంటే ఏముంటుందని విమర్శిస్తున్నారు. చాలా సినిమాల్లో రజనీకాంత్ నలుపు రంగును పొగుడుతూ సాంగ్స్ ఉన్నాయి.... మరి ఇప్పుడు ఈ యాడ్స్ చూస్తేనేమో నలుపు కాదు తెలుపే ప్రధానం అన్నట్లుగా ఉంది.


సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎలాంటి యాడ్స్ లో నటించలేదు. ఆయన నేరుగా యాడ్స్ చేయకపోయినా.. దర్శక నిర్మాతలు మాత్రం రజినీ క్రేజ్ ను బాగా వేడేసుకుంటున్నారు. రజనీని యాడ్స్ చేయడానికి ఒప్పించలేక పోయిన కార్పరొట్ సంస్థలన్నీ కబాలి ముసుగులో రజనీ వాడేసుకున్నాయి.


ఇదే ఆ పెయిర్ నెస్ క్రీమ్ యాడ్

ఇదే ఆ పెయిర్ నెస్ క్రీమ్ యాడ్

రజనీ కబాలి పోస్టర్ తో డిజైన్ చేసిన ఇమామి ఫెయిర్ అండ్ హాండ్సమ్ క్రీమ్ యాడ్ ఇదే..


రజనీని బాగా వాడేసారు

రజనీని బాగా వాడేసారు

రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగును అడ్డుపెట్టుకుని ఎయిరేషియా లాంటి ఎయిర్ లైన్స్ సంస్థలతో పాటు చాలా కార్పొరేట్ సంస్థలను నిర్మాత తన బుట్టలో వేసుకున్నాడు.


భారీ ఆదాయం..

భారీ ఆదాయం..

సాధారణంగా పెద్ద సినిమాలకు పబ్లిసిటీ చేయడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిర్మాత చేసిన ప్లాన్ తో అతనికి ఆ ఖర్చులు భారీగా మిగలడంతో పాటు అదనపు ఆదాయం కూడా వచ్చింది.


ఫైనాన్స్ సంస్థలు కూడా..

ఫైనాన్స్ సంస్థలు కూడా..

మరో వైపు కేరళ బేస్డ్ ముత్తూట్ ఫిన్ కార్ప్ సంస్థ సినిమా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుని రజనీకాంత్ కబాలి బొమ్మలతో సిల్వర్ కాయిన్స్ రిలీజ్ చేసింది. ఒక సినిమా స్టార్ విషయంలో ఇంత క్రేజ్ రావడం ఇదే తొలిసారి.


ఏమీ చేయలేక..

ఏమీ చేయలేక..

రజనీకి ఇలాంటివి పెద్ద ఇష్టం ఉండవు... కానీ కబాలి సినిమాకు ముందే రూ. 50 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారట రజనీ. అగ్రిమెంటు ప్రకారం నిర్మాతకు తన సినిమా పోస్టర్లను ప్రమోషన్స్ కు వాడుకునే హక్కు ఉండటంతో రజనీకూడా ఏమీ చేయలేక పోయారు.


చాక్లెట్లు కూడా..

చాక్లెట్లు కూడా..

చివరకు ఫైవ్ స్టార్ చాక్లెట్లు కూడా రజనీకాంత్ కబాలి పోస్టర్లతో యాడ్స్ చేసాయంటే రజనీ పట్ల కార్పొరేట్ సంస్థకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


English summary
Funny jokes circulating in social media about Fair and Handsome Kabali ad posters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu