»   » ఫన్నీ ఫోటో : ఎన్టీఆర్, బన్నీ, పూరి, వైట్ల ఇలా...!

ఫన్నీ ఫోటో : ఎన్టీఆర్, బన్నీ, పూరి, వైట్ల ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల ఈ నలుగురూ కలిసి ఏం చేస్తున్నారో క్రింది ఫోటోలో చూడండి. చాలా ఫన్నీగా ఉంది కదూ. ఇలా ముగ్గురూ కలిసి సెల్ ఫోన్లో ఏదో...? చేస్తున్నారు. అంత హడావుడిగా వారు చేస్తున్న పనేదో తెలియదు కానీ....ఈ ఫోటోకు పలువరు సినీ ప్రియులు రకరకాల సంభాషణలు అన్వయిస్తూ ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా అల్లు అర్జున్-పూరి కాంబినేషన్లో ఇద్దరమ్మాయిలతో, జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో బాద్‌షా చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగులు యూరఫ్‌లో ఓకే ఏరియాలో జరుగుతుండగా ఇలా అంతా కలుసుకున్నారు.

ఆ ఫోటో సంగతి పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా వివరాల్లోకి వెళితే ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్నారు. మరో వైపు దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం తన తాజా సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేస్ గుర్రం చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. ఇద్దరమ్మాయిలతో తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్‌తో 'హార్ట్ ఎటాక్' చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు.

English summary
Funny Photo posted by Puri Jagannath shows actors Allu Arjun, NTR Jr and director Srinu Vytla bonding big time in Spain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu