»   »  ఫుట్సల్: హీరో రానా, సన్నీ లియోన్ జాయిన్ అయ్యారు

ఫుట్సల్: హీరో రానా, సన్నీ లియోన్ జాయిన్ అయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హీరో రానా,సన్నీలియోన్ జాయిన్ అయ్యారు.Rana Daggubati And Sunny Leone Joined Fustal | Filmibeat Telugu

ఇండియాలో 150 కోట్ల జనాభా.... క్రికెట్ అంటే ప్రాణం, దాంతో పాటు దేశీయ ఆటలన్నా ఎక్కడలేని ఆసక్తి . అందుకే 'ఐపీఎల్' గ్రాండ్ సక్సెస్ అయింది. 'ప్రో కబడ్డీ' బంపర్ హిట్ అయింది. అదే విధంగా బ్యాడ్మింట్ లీగ్, ఫుట్ బాల్ లీగ్స్ ఇలా రకరకాల గేమ్స్, లీగ్స్ తరచూ జరుగుతున్నాయి.

దేశంలోని క్రీడా ప్రముఖులు, సినీ స్టార్లు ఆయా లీగ్స్‌లో జాయిన్ కావడం, జట్లను కొనుగోలు చేయడం లాంటి చేస్తుండటం, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుండటంతో ఆయా లీగ్స్ మరింత గ్లామర్ సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో రానా, సన్నీ లియోన్ కూడా వార్తల్లోకి ఎక్కారు.

ఫుట్సల్

ఫుట్సల్

ఫుట్సల్ అనే గేమ్ లీగ్‌లో టాలీవుడ్ స్టార్ రానా, బాలీవుడ్ సెక్సీ లేడీ సన్నీ లియోన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఫుట్సల్ అనేది ఫుడ్ బాల్ తరహాలో సాగే ఓ గేమ్. ఫుట్ బాల్ ఔట్ డోర్ స్టేడియంలో జరిగితే, ఫుట్సల్ ఇండోర్ స్టేడియంలో జరిగే గేమ్.

జట్ల కొనుగోలు

జట్ల కొనుగోలు

ఫుట్సల్... కేరళ కోబ్రాస్ టీమ్‌కు కో ఓనర్ గా ఉండటంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‍‌గా సన్నీ లియోన్ జాయిన్ అయింది. తెలుగు టైగర్స్ టీమ్‌కు తరుపున హీరో రానా రంగంలోకి దిగినట్లు సమాచారం.

సెకండ్ ఎడిషన్

సెకండ్ ఎడిషన్

ప్రస్తుతం జరిగేది ఫుట్సల్ సెకండ్ ఎడిషన్ లీగ్. గతంలో జరిగిన ఫుట్సల్ లీగ్ కు మంచి ఆదరణ లభించింది. ఈ ఆటకు మరింత గ్లామర్ తెచ్చేందుకు సినీ స్టార్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 15 నుండి

సెప్టెంబర్ 15 నుండి

సెప్టెంబర్ 15 నుండి ఫుట్సల్ సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ముంబై, బెంగుళూరు నగరాల్లో ఫుట్సల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. రానా, సన్నీ లియోన్ ఎంట్రీతో ఈ ఆటకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

English summary
Futsal is a variant of football. Tollywood hero Rana Daggubati and Bollywood beauty Sunny Leone are showing interest in this sport. Sunny Leone is going to the co-owner and brand ambassador of Kerala Cobras team, and Rana will be seen as the new face of Telugu Tigers team in the second edition of Futsal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu