»   » సుశాంత్ నెక్ట్స్ చిత్రం డైరక్టర్ ఆయనే

సుశాంత్ నెక్ట్స్ చిత్రం డైరక్టర్ ఆయనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున మేనల్లుడు సుశాంత్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. 6 టీన్స్,గుడ్ బోయ్, గర్లప్రెండ్, సీమశాస్త్రి వంటి కామిడీలను రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్న (మార్చి 18) జరిగిన పుట్టిన రోజు వేడుకలో సుశాంత్ ఈ చిత్ర విశేషాలను మీడియా ముందుంచారు. ఇక ఈ చిత్రం కూడా సుశాంత్ సొంత బ్యానర్ శ్రీ నాగ్ ఫిల్మ్ కార్పోరేషన్ లో రూపొందిస్తున్నారు. ఈ విషయమై సుశాంత్ మాట్లాడుతూ...నేను బయిట బ్యానర్ లో సినిమా చెయ్యాలంటే ముందుగా ఓ పెద్ద హిట్ కొట్టిన తర్వాతే అని నిర్ణయించుకున్నాను అన్నారు. ఇక నాగేశ్వరరెడ్డి లేటెస్ట్ గా కోదండరామి రెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా కాస్కో అనే చిత్రం రూపొందించారు. సినిమా ఫెయిల్యూర్ అయినా అందులో కామిడీకి మంచి పేరు వచ్చింది. అలాగే సుశాంత్ ఇప్పటికి కాళిదాసు, కరెంట్ అనే రెండు చిత్రాల్లో హీరోగా చేసారు. రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ మూడో సినిమా అయినా సుశాంత్ ని నిలబెట్టాలని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu