»   » 'గబ్బర్ ఈజ్ బ్యాక్' అంటున్న డైరక్టర్ క్రిష్ (వీడియో)

'గబ్బర్ ఈజ్ బ్యాక్' అంటున్న డైరక్టర్ క్రిష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 'ఠాగూర్' సినిమాను బాలీవుడ్ లో గబ్బర్ గా తెరకెక్కిస్తూ బాలీవుడ్ లోకి జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పాత్రను అక్షయ్ కపూర్ పోషిస్తున్నారు. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి మరియు 18మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంభందించిన టీజర్ ని విడుదల చేసారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ ప్రోమో వచ్చింది. మీరూ ఓ లుక్కేయండి.

తన విధ్యార్ధులతో కలిసి లంచం తీసుకుంటున్న వాళ్ళని మట్టికరిపిస్తూ వుండే ఉపాధ్యాయపాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ పాత్రకోసం చాలా రోజులుగా అక్షయ్ కష్టపడ్డాడు. క్రిష్ కి ఇది పెద్ద ప్రొజెక్ట్. ఇప్పటివరకూ క్రిష్ ‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణంవందే జగద్గురుం' సినిమాలు తీశాడు. స్టార్ల విషయం, బడ్జెట్ విషయం లెక్కిస్తే క్రిష్ కు ఇదే పెద్ద ప్రొజెక్ట్ కానుంది.

ఇక ‘గబ్బర్' సినిమాలో సుమన్ విలన్ గా కనిపించనున్నాడు. సుమన్ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ ‘ ‘శివాజీ' సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ తన ఎత్తుకి, పర్సనాలిటీకి నేనైతే బాగుంటానని అక్షయ్ చెప్పడంతో క్రిష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ పాత్రలో నేను బాగుంటానని ‘గబ్బర్' మూవీకి సెలక్ట్ చేసారని' సుమన్ అన్నాడు.

'Gabbar Is Back' Teaser Released: Akshay Kumar Challenges Corruption [VIDEO]

దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే...
'గబ్బర్' తర్వాత క్రిష్ తెలుగులో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చిత్రం ప్లాన్ చేస్తు్న్నారు. క్రిష్ అభిరుచికి తగ్గట్టుగా, నటునిగా వరుణ్‌తేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే రీతిలో ఉండే కథాంశాన్ని క్రిష్ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ 'ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్'పై ఈ చిత్రం రూపొందనుందనీ, 'ముకుందా' తర్వాత వరుణ్ చేస్తున్న చిత్రం ఇదని చెప్తున్నారు.

మకో ప్రక్క క్రిష్ త్వరలో నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన సైవం చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఓ వెరైటి టైటిల్ అదీ తెలుగుతనం ఉట్టిపడే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌లో గబ్బర్ చిత్ర షూటింగ్‌ని పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ సైవం రీమేక్‌ని ఉషాకిరణ్ మూవీస్‌తో కలిసి నిర్మించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి దాగుడుమూతలు దండాకోరు అనే టైటిల్‌ను ఖరారు చేసి ప్రోమోలు ఇప్పటికే వదిలారు.

English summary
"Gabbar Is Back" teaser is out, and Akshay Kumar's stern voice over is surely a threat to the hoodlums and racketeers.
Please Wait while comments are loading...