»   » ‘గబ్బర్ సింగ్-2’ ఆలస్యానికి కారణాలివేనా?

‘గబ్బర్ సింగ్-2’ ఆలస్యానికి కారణాలివేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం 100 రోజులకు చేరువ అవుతున్నా......ఆయన నటించే తర్వాతి చిత్రం 'గబ్బర్ సింగ్-2' షూటింగ్ ఇంకా పట్టాలెక్కలేదు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం అవ్వాల్సి ఉండగా రకరకాల కారణాలతో షూటింగ్ లేటవుతూ వస్తోంది. డిసెంబర్ చివరి వారానికి మార్పు చేసినా....అది కూడా డౌటే అంటున్నారు.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రం స్క్రిప్టు ఇంకా ఫైనల్ కాలేదని, సంపత్ నంది తయారు చేసిన స్క్రిప్టుపై పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేడని, ఇంకా బెస్ట్ స్క్రిప్టు కావాలని చెప్పడంతో స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసే పనిలో సంపత్ నంది నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఎంపిక విషయం కూడా సినిమా ఆలస్యం కావడానికి మరో కారణమని సమాచారం.

ఈ నెలలో స్ర్కిప్టు వర్కు పూర్తయితే జనవరిలో 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది. సినిమా మొదలైన తర్వాత....అంతా ప్లానింగ్ ప్రకారం, అనుకున్న రోజు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో కూడా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గబ్బర్ సింగ్-2లోని డైలాగులు అంటూ నెట్లో కొన్ని డైలాగులు హల్ చల్ చేస్తున్నాయి. 'నేను టెంపర్ లాస్ అయితే...టెంపో లేకుండా కొడతా', 'ఫస్ట్ పార్టులో నా తిక్కకి లెక్క ఉందిరోయ్...ఈ పార్టులో లెక్కే లేదు' అనే డైలాగులు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి నిజంగానే సినిమాలోని డైలాగులేనా? కాదా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Pawan Kalyan's ‘Gabbar Singh 2′ delay due to various reasons. First is the script of the film has not yet completed and Pawan Kalyan is asking better version of Sampath Nandi .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu