»   » పవన్ నుంచి మామిడికాయలు అందుకున్నాడు

పవన్ నుంచి మామిడికాయలు అందుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమ్మర్ వచ్చిందంటే ...పవన్ కళ్యాణ్ తన అనుకున్న వారికి మామిడికాయలు పంపటం ఆనవాయితీ. క్రితం సంవత్సరం నితిన్ ఈయన నుంచి మామిడికాయలు అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఆనందం పొందారు. అలాగే... ఆయన నుంచి మామిడికాయలు అందుకున్న మరో అదృష్టవంతుడు...గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి. ఈ విషయమై ఆయన ఆయన ఆనందంతో ట్వీట్ చేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pleasantly surprised at the basket of mangoes from none other than the power star. Aam for the Aam aadmi󾌵

Posted by Santosh Ravindra Kolli on 4 June 2015

'గబ్బర్‌సింగ్‌ 2' విషయానికి వస్తే...

చిత్రం సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైనా షూటింగ్ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన ఆ చిత్రం ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లి అఫ్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క్రితం శుక్రవారం మహారాష్ట్రలోని మాల్షెజ్‌ ఘాట్‌లో చిత్రీకరణ మొదలుపెట్టారు. విలన్ గ్యాంగ్ పై సన్నివేశాల్ని తెరకెక్కించారు. అయితే ఈ షెడ్యూల్ లో ...పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగలేదు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక త్వరలో పవన్ షూటింగ్ లో పాల్గొంటారని నిర్మాత శరత్‌ మరార్‌ వెల్లడించారు. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన అనీషా ఆంబ్రోస్‌ నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. 'గబ్బర్‌సింగ్‌' తరహాలో ఇందులోనూ పవన్‌ కల్యాణ్‌ గన్నులు తిప్పి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. గుర్రపుస్వారీ కూడా చేయబోతున్నారట.

''మాల్షేజ్‌ ఘాట్‌లో పవన్‌కోసం గన్నులు, గుర్రాలు రెడీగా ఉన్నాయ''ని నిర్మాత ట్వీట్‌ చేశారు. నిర్మాత శరత్ మరార్ ఈ విషయం గురించి స్పందిస్తూ..‘గబ్బర్ సింగ్-2 చిత్రం ఈ రోజు మార్నింగ్ ఎంతో గొప్పగా ప్రారంభం అయింది. టీం మెంబర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగుగా ఉన్నారు. మల్షెజ్ ఘాట్లో తుపాకులు, గుర్రాలు. పవర్ స్టార్ త్వరలో షూటింగులో జాయిన్ అవుతారు' అని వెల్లడించారు.

Gabbar Singh 2 director received Pawan mangoes

తన తిక్క చూపించి విలన్ లెక్కల్ని తేల్చి 'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ప్రేక్షకులకు వినోదాలు పంచాడు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు మరోసారి పోలీసు గబ్బర్‌సింగ్‌గా పవన్‌ను అదరకొట్టి అభిమానులను ఆనందపరచనున్నారు.

అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈచిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

గబ్బర్ సింగ్ 2 లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతికారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుందని టాక్. ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.

English summary
Bobby tweeted the picture of mangoes and said, "Pleasantly surprised at the basket of mangoes from none other than the power star. Aam for the Aam aadmi"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu