»   » గబ్బర్ సింగ్-2: మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి, ఎక్కడ?

గబ్బర్ సింగ్-2: మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి, ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2' ప్రాజెక్టు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ చిత్రం లాంచింగ్ మే 29న జరుగబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ డేట్ ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిషా అంబ్రోస్ లీడ్ హీరోయిన్. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో ప్రారంభం అయ్యాయి.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా అతనే కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Gabbar Singh-2 Music sittings

కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ, నర్రా శ్రీనులను తారాగణంగా ఎంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మరికొంత మందిని తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: జైనన్ విన్సెంట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కాస్ట్యూమ్స్ భానూమోరే, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్.

English summary
Music sensation Devi Sri Prasad and director Ravindra are busy with the music sittings for Gabbar Singh-2.
Please Wait while comments are loading...