»   » లాభాల్లో వాటా తీసుకునేలా పవన్ కళ్యాణ్ ఒప్పందం!

లాభాల్లో వాటా తీసుకునేలా పవన్ కళ్యాణ్ ఒప్పందం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ త్వరలో గబ్బర్ సింగ్-2 చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అసలు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. 20 కోట్ల బడ్జెట్ లోనే సినిమా మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత పెట్టుబడి పోను వచ్చిన లాభాల్లో సగం వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

ఇటీవల పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గోపాల గోపాల' చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు. సినిమా రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతలైన సురేష్ బాబు, శరత్ మరార్ లకు మంచి లాభాలు వచ్చాయి. వెంకటేష్, పవన్ కళ్యాన్ లు కూడా రెమ్యూనరేషన్ కింద మంచి మొత్తాన్నే పొందారు. అయితే కొందరు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ చిత్రం కొద్దిపాటి నష్టాలను మిగిల్చిందని అంటున్నారు.

అయితే తన గబ్బర్ సింగ్-2 విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నాడట. అందుకే ఒక ప్లానింగ్ ప్రకారం ఆయన ముందుకు సాగుతున్నారని టాక్. అందులో భాగంగానే రెమ్యూనరేషన్ గట్రా లేకుండా పని చేయడానికి సిద్ధమయ్యారట.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Gabbar Singh 2: Pawan Kalyan has 50% share

ఎప్పుడు మొదలవుతుంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ప్రారంభించబోతున్నారని అంతా అనుకుంటుండగా.....ఫిల్మ్ నగర్లో ఓ పుకారు మొదలైంది. ఈ సంవత్సరంలో ఆయన సినిమాలేవీ విడుదలయ్యే పరిస్థితి కనబడటం లేదంటున్నారు. ‘గబ్బర్ సింగ్-2' సినిమా మొదలు పెట్టాలని ప్రయత్నించినా బ్యాక్ పెయిన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2015 ద్వితీయార్థంలోనే ఆ సినిమా మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అది పూర్తయి విడుదలయ్యేది 2016లోనే అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

లియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

English summary
It is known that Gabbar Singh 2 is being produced by Sarat Marar. And Pawan Kalyan has 50 per cent share in the film, which means that he will not take any remuneration, but he will be taking half the profits once the film releases.
Please Wait while comments are loading...