»   » గబ్బర్ సింగ్-2 షూటింగ్ ఎప్పటి నుండి?

గబ్బర్ సింగ్-2 షూటింగ్ ఎప్పటి నుండి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్ -2' చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 20 నుండి సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి ఒకరిని సెకండ్ హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉంది.

Gabbar Singh 2 shooting from March 20th

ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అసలు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. 20 కోట్ల బడ్జెట్ లోనే సినిమా మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత పెట్టుబడి పోను వచ్చిన లాభాల్లో కొంత వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు.

English summary
Power Star Pawan Kalyan’s forthcoming action movie “Gabbar Singh-2” under the direction of K.S.Ravindra alias Bobby is going to start its regular shooting from March 20th onwards.
Please Wait while comments are loading...