twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో...‘గబ్బర్ సింగ్’ ఫెయిల్యూర్

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గత వారం విడుదలైన తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెలుతోంది. తొలి 10 రోజుల్లో ఈచిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించింది. పవర్ స్టార్‌ కెరీర్లోనే ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ చిత్రంగా నిలిచింది. ఇటు దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు, నిర్మాత బండ్ల గణేష్‌లకు ఈచిత్రం స్టార్ హోదాను తెచ్చి పెట్టింది.

    అయితే ఓ విషయంలో మాత్రం 'గబ్బర్ సింగ్' ఫెయిల్యూర్ అయింది. పైరసీని అరికట్టడంలో ఈ చిత్ర దర్శక నిర్మాతలు పూర్తిగా విఫలం అయ్యారు. గబ్బర్ సింగ్ పైరసీ సీడీలు, డీవీడీలు ఇబ్బడి ముబ్బడిగా లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ నుంచి కూడా పైరసీ వెర్షన్ ఫ్రీగా డౌన్‌లోడ్ అందుబాటులో ఉంది. వీటిని నిరోధించడానికి దర్శక నిర్మాతలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

    పైరసీ మూలంగా ఇప్పటికే చిత్రానికి దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని, పరిస్థితిని అదుపు చేయలేక పోతే సినిమా బిజినెస్ పూర్తయ్యే సరికి కనీసం 10 నుంచి 15 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా నిర్మాత బండ్ల గణేష్ మేల్కొని పైరసీ అరికట్టడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

    English summary
    Let the collections be showered like a rain, let the entire crew be passed with flying colours in terms of the movie's collections, but the movie has been failed in one aspect and that is due to the the piracy of the movie. We have been hearing that piracy CDs hamper the collections of the movie a lot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X