»   » వెండితెరపై 'గబ్బర్‌ సింగ్‌' కూతురు

వెండితెరపై 'గబ్బర్‌ సింగ్‌' కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ahlam Khan
ముంబై: హీరో కొడుకులు,ఒక్కోసారి కూతుళ్లు వెండితెరపై వారసత్వంగా అందిపుచ్చుకుని హీరోగా,హీరోయిన్ లుగా వెలుగుతున్నారు. ఈ నేపధ్యంలో విలన్ కూతురు కూడా ప్రధాన పాత్ర చేస్తూ రానుంది. ఆమె మరెవరో కాదు.. 'గబ్బర్‌ సింగ్‌' కూతురు అహ్లమ్‌. తన నటనా జీవితానికి సినిమా ఒక పొడిగింపులాంటిదన్నది అహ్లమ్‌ అభిప్రాయం.

హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషిస్తూ కూడా ప్రేక్షకుల గుండెల్లో హీరో స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అంజాద్‌ ఖాన్‌. 'గబ్బర్‌ సింగ్‌' అంటూ వంద కోట్ల రూపాయలు గుమ్మరించిన పవన్‌ కల్యాణ్‌ సినిమాలోని ఈ పాత్ర వెనుక ఉన్న అసలు గబ్బర్‌ సింగ్‌ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు 'షోలే' చిత్రంతో బాలీవుడ్‌లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి మహానటుడి వారసురాలు కూడా వెండి తెరపై తళుక్కున మెరవనుంది.

అంజాద్‌ ఖాన్‌ కుమార్తె అయిన అహ్లమ్‌ తన మొదటి చిత్రంతో హిందీ చిత్రపరిశ్రమలో కాలుమోపనున్నది. తాను చిత్రపరిశ్రమకు ఇప్పుడు పరిచయం అవుతున్నప్పటికీ నాటక రంగంలో ఎప్పటి నుంచో ఉన్నానని అంటోంది అహ్లమ్‌. రచయిత, దర్శకుడు మకరంద్‌ దేశ్‌పాండే నాటకం 'మిస్‌ బ్యూటిఫుల్‌'ని ఆయనే నిర్మాతగా తెరకెక్కించనున్నారు. హిందీలో 'మిస్‌ సుందరి'గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అహ్లమ్‌ నటించనుంది.

ఈ చిత్రాన్ని, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దీన్ని వ్యాపార దృష్టితో నిర్మించడంలేదని అంటున్నారు. మకరంద్‌. 'మిస్‌ బ్యూటిఫుల్‌' నాటకంలోని ఈ పాత్రను అహ్లమ్‌ పలుమార్లు పోషించిందని, సినిమాలో కూడా ఈమెను కాకుండా మరొకరిని వూహించలేనని అంటున్నారీయన. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయిన అహ్లమ్‌ ఈ చిత్ర ప్రచారంలో కూడా పాలుపంచుకుంటుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చిలో ప్రేక్షకులను అలరించనుంది.

English summary
One of the greatest Bollywood Villain late Amjad Khan’s (Gabbar Singh) daughter Ahlam Khan may not be a reputed name in the film fraternity but she’s a big name on stage.Now it seems the film industry is noticing this untapped talent.She is getting ready to make her debut next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu