నాగ్‌తో నటించడం ఆనందంగా ఉంది: సౌతాఫ్రికా మోడల్
హైదరాబాద్: సౌతాఫ్రికాకు చెందిన మోడల్, నటి గాబ్రియేలా డెమెట్రియేడ్స్ నాగార్జున-కార్తి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనకు అవకాశం దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసారు.
‘ఈ సినిమాలో అవకాశం దక్కడం నా కెరీర్ కి డ్రీమ్ స్టార్ట్. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జున లాంటి స్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర చేస్తున్నారు. అయితే ఆ పాత్ర ఏమిటనేది ఇప్పుడే చెప్పలేను' అని గాబ్రియేలా అన్నారు. ఇంతకు ముందు ఆమె హిందీ ఫిల్మ్ ‘సోనాలి కేబుల్' అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించింది.

కింగ్ నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీకి ‘ఊపిరి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఊపిరి' అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు, తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











