»   » గద్దర్ హాట్ టాపిక్: పవన్‌ కళ్యాణ్‌తో దోస్తీ, ఇపుడు పాట రాస్తున్నాడు!

గద్దర్ హాట్ టాపిక్: పవన్‌ కళ్యాణ్‌తో దోస్తీ, ఇపుడు పాట రాస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విప్లవ గాయకుడు మరోసారి సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యాడు. త్వరలో ఆయన ఓ తెలుగు సినిమాకు పాట రాయబోతుండటమే అందుకు కారణం. దర్శకుడు చంద్ర సిద్ధార్థ తెరకెక్కించబోతున్న సినిమా కోసం గద్దర్ పాట రాబోతున్నారు.

ఇంతకు ముందు గద్దర్ జైబోలో తెలంగాణ సినిమా కోసం 'పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా' అనే పాటను స్వయంగా రాసి, పాడిన సంగతి తెలిసిందే. అయితే మరి చంద్ర సిద్ధార్థ సినిమాలో కేవలం పాట రాయడానికే పరిమితం అవుతాడా? లేక స్వయంగా ఆయనే పాడుతారా? అనేది తెలియాల్సి ఉంది.

డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్

డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్

2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు' అనే సినిమాకు చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మరో సానిమాకు ప్లాన్ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన అందరి బంధువయా, ఇదీ సంగతి, మధుమాసం, ఆ నలుగురు, అప్పుడప్పుడు చిత్రాలను తెరకెక్కించారు.

త్వరలో సినిమా సెట్స్ మీదకు

త్వరలో సినిమా సెట్స్ మీదకు

చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించబోతున్నారు. రావు రమేష్, హైపర్ ఆది ఈచిత్రంలో కీలకమైన పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో గద్దర్ దోస్తీ

పవన్ కళ్యాణ్ తో గద్దర్ దోస్తీ

ఈ మధ్య కాలంలో గద్దర్ పవర్ స్టార్ పవన్ క ళ్యాణ్ కు సంబంధించిన ప్రస్తావనతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అని, రాజకీయాల్లో ఆయనతో కలిసి పని చేసే అవకాశాన్ని ఆలోచిస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.

చిటికెలో వచ్చేది కాదు

చిటికెలో వచ్చేది కాదు

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పవన్‌ కళ్యాణ్ స్థాపించిన జనసేన గురించి విస్తృతంగా చర్చ సాగుతోందని చెప్పారు. రాజ్యాధికారం చిటికెలో వచ్చేది కాదని గద్దర్ చెప్పారు.

English summary
Revolutionary Telangana poet and balladeer Gaddar has once again turned lyricist for a Telugu film. Gaddar will be penning a couple of songs in director Chandra Siddhartha’s soon to be launched movie. Kannada producer Rockline Venkatesh is bankrolling this film. Rao Ramesh and Hyper Adi will be essaying crucial roles​ in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu