»   » నాకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి..స్టార్ హీరో..!?

నాకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి..స్టార్ హీరో..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున ఫోర్తో కమింగ్ ఎక్సిపిరిమెంటల్ మూవీ 'గగనం" తృప్తినిచ్చే సినిమాలు చేసే దశకు వచ్చేశా ! ప్రేమ, యాక్షన్‌ రివెంజ్‌ లాంటి ఫార్ములా సినిమాలిప్పిటికెన్నో వచ్చేశాయి. ఇక ఓ కొత్త పంథాకి తెరలేపాలి. అలాంటి సినిమానే గగనం. ఓ నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది"అంటున్నారు అక్కినేని నాగర్జున.

ఆయన కీలకపాత్రధారిగా 'ఆకాశమంత" రాధామోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషాచిత్రం 'గగనం". దిల్‌ రాజు తెలుగువెర్షన్‌ నిర్మాత. ప్రకాష్‌ రాజ్‌ తమిళ వెర్షన్‌ (పయనం) నిర్మాత. ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ..నాగార్జున అన్నమాటలివి.

మరిన్ని విశేషాలు మాట్లాడుతూ 'నాగ్‌ కొత్తగా చేస్తాడు, ట్రెండ్‌ సెట్టర్‌..అనే పేరు ఉంది. ఈ మధ్య కాలంలో అలాంటివేం చేయలేదు. కొత్తగా ప్రయత్నించిన సినిమా గగనం. ఈ సినిమా చేసినందుకు నాకు నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే..మరెన్నో ఆ తరహా ప్రయత్నాలు జరుగుతాయి. డాన్సులు, ఫైట్లు లేకుండా సినిమాలెప్పుడొస్తాయి..? అని ఇటీవల ఓ వెబ్‌ సైట్‌లో చదివాను. అలాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే సినిమా ఇది" అన్నారు. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్ కౌర్, భరత్ రెడ్డి, రిషి తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu