»   » టీవీ నటుడిని పెళ్లాడబోతున్న అందాల తార!

టీవీ నటుడిని పెళ్లాడబోతున్న అందాల తార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ గజాల గుర్తుందా? అదే నండీ జూ ఎన్టీఆర్, రాజమౌళి కెరీర్లో తొలి హిట్ చిత్రం 'స్టూడెంట్ నెం.1' చిత్రంలో హీరోయిన్ నటించింది. ఐదారేళ్ల క్రితమే సినిమా రంగానికి దూరమైన గజాల తాజాగా ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆమె పెళ్లి సెట్టవ్వడమే ఇందుకు కారణం.

టీవీ నటుడు ఫైసల్ రాజా ఖాన్ ను గజాల పెళ్లాడబోతోంది. ఈ నెల 24న పెళ్లి డేట్ పిక్స్ చేసారు. ముంబైలో ఈ పెళ్లి వేడుక పెద్దగా ఆర్భాటాలకు పోకుండా సాధరణంగానే జరుపబోతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆధ్వర్యంలో వివాహ వేడుక జరుగబోతోంది. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా జరుపబోతున్నారు. సింపుల్ వైట్ అండ్ గోల్డ్ థీమ్ తో వివాహ వేడుక జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Gajala Marriage With Faisal Raza Khan

గజాల కెరీర్లో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నారు. 2002లో ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకుని హైదరాబాద్ లో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. అదృష్ణ వశాత్తు ఆమె కో యాక్టర్ అర్జున్ ఇది గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎఫైర్ కారణంగానే ఆమె అలా చేసిందనే ప్రచారం అప్పట్లో జరిగింది.

2001లో జగపతి బాబు చిత్రం 'నాలో ఉన్న ప్రేమ' ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గజాల.... తర్వాత తెలుగు, తమిళం, కన్నడలో పాతికకుపైగా సినిమాలు చేసింది. అయితే కొత్త హీరోయిన్ల తాకిడిలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలం అయిన గజాల ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఆమె నటించిన చివరి సినిమా తెలుగులో 'మనీ మనీ మోర్ మనీ'.

English summary
Actress Gajala is getting married to a TV actor Faizal Raza Khan tomorrow. Gajala though started her career with Jagapathi babu's Naalo Unna Prema, she scored her first super success with NTR's Student No 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu